తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ బస్సు డ్రైవర్ గుండె పోటుతో మరణించారు. గురువారం ఉదయం మధురై వద్ద బస్సు నడుపుతున్న ఆరుముగం గుండెపోటుతో చనిపోయే ముందు 30 మంది ప్రాణాలను కాపాడాడు. డ్రైవర్‌ ఆరుముగం 30 మంది ప్రయాణికులతో అరప్పాలయం నుండి కొడైకెనాల్‌కు బస్సును నడుపుతున్నాడు. బస్సు ఉదయం 6.20 గంటలకు అరప్యాలయం నుండి బయలుదేరినప్పుడు, డ్రైవర్ ఆరుముగం తీవ్రమైన ఛాతీ నొప్పి వస్తోందని కండక్టర్ భాగ్యరాజ్‌కు చెప్పాడు. ఎలాగోలా కింద పడిపోయే ముందు వాహనాన్ని డ్రైవర్‌ రోడ్డు పక్కన నిలిపాడు. కండక్టర్ వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు కానీ అది వచ్చేసరికి ఆరుముగం మృతి చెందాడు.

టీఎన్‌ఎస్‌టీసీ డిప్యూటీ కమర్షియల్ మేనేజర్, మధురై, యువరాజ్ మాట్లాడుతూ.. "ఆరుముగమ్‌కి TNSTCలో డ్రైవర్‌గా 12 సంవత్సరాల అనుభవం ఉంది. 30 మంది ప్రాణాలను కాపాడి రోడ్డు పక్కన బస్సును పార్కింగ్ చేసిన అతని ఆదర్శప్రాయమైన చర్య ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. అతను ఇద్దరు కుమార్తెలను విడిచిపెట్టి వెళ్లిపోయాడు" అని అన్నారు. డ్రైవర్‌ ఆరుముగం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరిమేడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని జీఆర్‌హెచ్‌ ఆస్పత్రికి తరలించేలోపు ఆరుముగం కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story