హైదరాబాద్ లో తమ మూడవ ఎడిషన్ ను ప్రారంభించిన రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్
అమిత్ త్రివేది, నిఖితా గాంధీ, రఫ్తార్ మరియు DJ యోగి వంటి శక్తివంతమైన ప్రదర్శకులను కలిగి ఉన్న ఉత్సాహపూరితమైన రాత్రి కోసం సిద్ధంగా ఉండండి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Jan 2025 6:30 PM IST
‘లివింగ్ ఇట్ లార్జ్’ యొక్క స్ఫూర్తిని సంబరం చేస్తూ, సీగ్రామ్ రాయల్ స్టాగ్ హైదరాబాద్, తెలంగాణాలో బౌల్డర్ హిల్స్ లో జనవరి 25న గొప్ప ప్రదర్శనతో రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మూడవ ఎడిషన్ యొక్క ఎంతగానో ఊహించిన ప్రారంభాన్ని సూచించింది. ఇంతకు ముందు ఎడిషన్స్ యొక్క విజయాలు ఆధారంగా రూపొందించబడిన ఈ ఏడాది ఫెస్టివల్ ఉత్తమమైన మ్యూజిక్ మరియు గేమింగ్ వినోదాన్ని ఒక చోటకు తీసుకురావడం ద్వారా మరింతగా ఆధిక్యతను సంపాదించింది. భారతదేశపు అత్యంత విజయవంతులైన కళాకారుల ద్వారా పెర్ఫార్మెన్స్ లను అనుభవించడానికి వేలాది ఔత్సాహికులు ఒక చోట చేరడంతో ఈ సాయంత్రం అనూహ్యమైన ప్రతిస్పందనను పొందింది. ఈ కార్యక్రమం ఉత్సాహవంతమైన మ్యూజిక్ , ఉల్లాసవంతమైన పెర్ఫార్మెన్స్ లు మరియు సాటిలేని ఉత్సాహం యొక్క గుర్తుండిపోయే నైట్ ను అందచేసింది.
బౌల్డర్ హిల్స్ విశాలమైన మైదానాలు ఆకర్షణీయమైన ఇన్ స్టలేషన్స్, లీనమయ్యే కళా ప్రదర్శనలు, కూర్చబడిన ఆహారపు అనుభవాలు, మరియు ఇంటరాక్టివ్ జోన్స్ తో ఉల్లాసకరంగా మారాయి, కేవలం మ్యూజిక్ మాత్రమే కాకుండా వివిధ రకాల సంబరాలను సృష్టించింది. ఉత్సాహవంతమైన డిజే యోగితో ఈ కార్యక్రమం ప్రారంభమైంది, ఆ రోజు కార్యక్రమానికి యోగీ సరైన వాతావరణాన్ని కలగచేసారు. ర్యాప్ శైలి రఫ్తార్ వేదిక పై చోటు చేసుకోవడంతో ఉత్సాహం రెట్టింపయ్యింది, తదుపరి విలక్షణమైన వోకలిస్ట్ నిఖితా గాంధీ ద్వారా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రదర్శితమైంది. ఈ గ్రాండ్ ఫినాలే లో మ్యూజిక్ దిగ్గజం అమిత్ త్రివేది వైభవోపేతమైన ముగింపు చర్య ఫెస్టివల్ యొక్క విభిన్నమైన మ్యూజికల్ శైలుల యొక్క సిగ్నేచర్ మిశ్రమానికి పరిపూర్ణమైన చిహ్నంగా నిలిచింది, జనరేషన్ లార్జ్ కోసం గుర్తుండిపోయే అనుభవాన్ని సృష్టించింది. ఈ కార్యక్రమం మున్నా భాయ్ గేమింగ్ మరియు జోకర్ కి హవేలీల మధ్య ఉత్సాహవంతమైన EAFC ఫేస్-ఆఫ్ లైవ్ ను కూడా వేదిక పైన ప్రదర్శించింది.
మ్యూజిక్ డైరెక్టర్ మరియు సింగర్ అమిత్ త్రివేది ఇలా అన్నారు, “రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మ్యూజిక్ యొక్క అందమైన సంబరం- హృదయం నుండి నేరుగా, సహజంగా మరియు ప్రామాణీకరంగా వచ్చింది. మెలొడీస్ ద్వారా కథలను భాగస్వామ్యం చేయడం మరియు ప్రజలతో లోతైన స్థాయిలో కనక్ట్ అవడం గురించి అని నేను భావిస్తాను. ఈ ప్లాట్ ఫాంతో భాగంగా ఉన్నందుకు నేను నిజంగా కృతజ్ఞతగా భావిస్తున్నాను మరియు అతుల్యమైన ఉత్సాహవంతమైన ప్రేక్షకులతో కలిసి ఇక్కడ హైదరాబాద్ లో పెర్ఫార్మెన్స్ చేయడం, ఉల్లాసోత్సాహవంతమైన అనుభవం కలిగించింది.
గాయని నిఖిత గాంధీ ఇలా అన్నారు, “వ్యక్తిగతంగా నాకు, రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ ఎల్లప్పుడూ మ్యూజిక్ ద్వారా హద్దుల్ని అధిగమించి, ప్రయోగం చేస్తుందని భావిస్తాను. అది శైలుల కలయిక కావచ్చు లేదా ఉల్లాసకరమైన లైవ్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, మేము సృజనాత్మకమైన పరిమితులను మించి ప్రదర్శించడానికి ఈ ప్లాట్ ఫాం మాకు అవకాశం ఇస్తుంది. హైదరాబాద్ లో రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ లో పెర్ఫార్మెన్స్ చేయడం గుర్తిండిపోయే అనుభవం మరియు ముంబయిలో నా తదుపరి షోకు నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను.”
ప్రముఖ హిప్-హాప్ కళాకారుడు రఫ్తార్ ఇలా అన్నారు, “ప్రభావం చూపించే బీట్స్, ఉద్వేగాలు ఎల్లప్పుడూ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ లో కీలకమైన అంశంగా ఉంటాయి. నా అభిప్రాయంలో ఇది ర్యాపింగ్ కు మించినది- ఇది ప్రజలను ఉత్సాహవంతమైన మరియు ఉద్వేగభరితమైన ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. హైదరాబాద్ ఈ రోజు మ్యూజిక్ జ్వాలను తెచ్చింది మరియు సహజమైన ఉత్సాహం మరియు ఉత్సాహోల్లాసాలతో వేదిక దద్దరిల్లిపోయేలా చేసే అవకాశం లభించినందుకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను!”
DJ యోగి ఇలా అన్నారు, “రాయల్ స్డాగ్ బూమ్ బాక్స్ ప్రేక్షకులు మ్యూజిక్ ద్వారా సజీవమైన అనుభూతి చెందడానికి సంబంధించినది. సంచలనం కలిగించే వాతావరణం కలిగించడానికి బీట్స్ ను మరియు శైలులను మిశ్రమం చేయడమే DJగా నా లక్ష్యం. ఈ ఏడాది నా ఉత్సాహాన్ని తీసుకురావడానికి మరియు కార్యక్రమాన్ని ఒక పెద్ద, మర్చిపోలేని పార్టీగా చేయడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను!” నైట్ ను ప్రారంభించడం అనేది ఎంతో ఉల్లాసవంతమైన అనుభూతి మరియు రాబోయే అలాంటి అతుల్యమైన పెర్ఫార్మెన్స్ లకు ఇది నేపధ్యం రూపొందించింది.”
ప్రసిద్ధి చెందిన గేమింగ్ ఇన్ ఫ్లూయెన్సర్ మున్నా భాయ్ ఇలా అన్నారు, “రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మ్యూజిక్ తో గేమింగ్ ను కలపడం గొప్పగా నిలిచింది. EAFC 24 షో ఫెస్టివల్ కు పూర్తిగా కొత్త కోణాన్ని తెచ్చింది మరియు ప్రేక్షకుల ప్రతిస్పందన అతుల్యంగా నిలిచింది. దీని కోసమే గేమింగ్ కమ్యూనిటీ వేచి ఉంది. “
జోకర్ కి హవేలీ జోడించారు, "ఒక గేమర్‌గా, నేను రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్‌తో జతకట్టడం పట్ల థ్రిల్డ్‌గా ఉన్నాను. హైదరాబాద్‌లోని లైవ్ గేమింగ్ ఫేస్-ఆఫ్‌లు ఈవెంట్‌కు విద్యుదీకరించే కొత్త లేయర్‌ను జోడించాయి మరియు దానిలో భాగం కావడం నాకు చాలా ఇష్టం."
కార్తీక్ మొహీంద్రా, ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మరియు పెర్నాడ్ రికార్డ్ ఇండియాలో గ్లోబల్ బిజినెస్ డవలప్ మెంట్ హెడ్ ఇలా అన్నారు, “ప్రజలను ఐక్యం చేయడానికి మరియు స్వచ్ఛమైన మేజిక్ యొక్క క్షణాలను సృష్టించడానికి మ్యూజిక్ యొక్క విశ్వజననీయ భాషకు ప్రత్యేకించి లైవ్ అనుభవాలలో, ఈ విశేషమైన శక్తిని కలిగి ఉంది. రాయల్ స్టాగ్ యువతకు మ్యూజిక్ ను తమ కీలకమైన అభిరుచి మూలస్థంభంగా సంబరం చేయడం కొనసాగిస్తోంది. ఇప్పుడు, మేము రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మూడవ ఎడిషన్ విడుదల చేస్తున్న సందర్భంలో, ఉత్తేజభరితమైన కొత్త సౌండ్ స్కేప్తో అనుభవాన్ని పెంచడానికి సిద్ధంగా ఉంది, ఆర్ట్ మరియు సాంస్కృతిక అనుభవాలతో పాటు హిప్-హాప్ యొక్క సంచలనాత్మకమైన బీట్స్ తో బాలీవుడ్ మెలొడీస్ ను మిశ్రమం చేస్తూ బ్రాండ్ యొక్క లివింగ్ ఇట్ లార్జ్ సిద్ధాంతానికి ఉదాహరణగా నిలిచింది.”
యతీష్ మెహ్ రిషి, ENIL సిఇఓ ఇలా అన్నారు, “రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మ్యూజిక్ మేజిక్ ద్వారా ప్రజలను ఒక చోట చేర్చడానికి సంబంధించినది- ఇది వినూత్నత సంస్కృతిని కలుసుకోవడానికి, సంప్రదాయం ఆధునిక ఉద్వేగాలతో నిరంతరంగా కలుసుకోవడానికి చెందినది. ENILలో విభిన్నతను సంబరం చేసే మరియు మరపురాని క్షణాలను సృష్టించే ప్రత్యేకమైన విషయం పై సహకరించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. దేశవ్యాప్తంగా జీవిత కాలం అపురూపంగా దాచుకునే స్థాయిని పెంచడానికి, శక్తి, ఆనందం మరియు జ్ఞాపకాలను పెంచడానికి ఈ ఎడిషన్ ఒక అభివృద్ధికరమైన ప్రయత్నం.”
లైవ్ కార్యక్రమాలకు అనుబంధంగా, బ్రాండ్ ఇన్-స్టూడియో సహకారాలు అందచేస్తుంది, శ్రావ్యమైన సంగీతం మరియు హిప్-హాప్ అంశాలతో మిశ్రమం చెందే ఒరిజినల్ ట్రాక్స్ ను సృష్టిస్తుంది. డిజిటల్ ప్లాట్ ఫాంలలో వీడియోలతో పాటు సింగిల్స్ గా ఇవి విడుదలవుతాయి.