ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) చీఫ్‌గా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్టాలిన్ పేరును పార్టీ నేతలు ఏకపక్షంగా ఆమోదించారు. ప్రముఖ నేత, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఎస్.దురైముగువాన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ టీఆర్ బాలు కూడా ఎలాంటి వ్యతిరేకత లేకుండానే ఆ పార్టీ కోశాధికారిగా మళ్లీ ఎన్నికయ్యారు. వీరు ముగ్గురూ రెండోసారి వరుసగా ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా కెఎన్ నెహ్రూ ఎన్నికయ్యారు. స్టాలిన్ తన చెల్లెలు కనిమొళి కరుణానిధిని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించారు. ఇతర ఉప ప్రధాన కార్యదర్శులు ఐ. పెరియసామి, ఎ. రాజా, కె. పొన్ముడి, అంతియూర్ సెల్వరాజ్. సమావేశం జరిగే వేదికను ద్రవిడ సిద్ధాంతకర్త, ఈవీ రాంసామి నాయకర్, సీఎన్ అన్నాదురై, కలైంజర్ కరుణానిధి చిత్రపటాలతో అలంకరించారు. 1949 లో డీఎంకేను స్థాపించారు. 1969 లో కరుణానిధి డీఎంకే పార్టీ అధ్యక్షుడయ్యారు. అప్పటివరకు డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
2018లో కరుణానిధి మరణాంతరం స్టాలిన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం డీఏంకే పార్టీ విజయం సాధించింది. ఎంకే స్టాలిన్.. గతంలో పార్టీ కోశాధికారిగా, పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా సేవలందించారు.