ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు విస్తరించిన అంపత్
AMPATH launched services in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యక్రమాలను విస్తరిస్తూ, అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ & లేబొరేటరీ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ (అంపత్)
By Medi Samrat Published on 9 Jun 2023 11:30 AM GMTఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యక్రమాలను విస్తరిస్తూ, అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ & లేబొరేటరీ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ (అంపత్) ఇటీవల విజయవాడలోని రామచంద్ర నగర్‌లోని పున్నయ్య - వజ్రమ్మ కాంప్లెక్స్‌లో ల్యాబ్‌ను ప్రారంభించింది. దాదాపు 2700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లేబొరేటరీ లో , వేగవంతమైన సమయంలో ఖచ్చితత్వంతో కూడిన నాణ్యమైన నివేదికలను అందించగల తాజా సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌లు అమర్చబడి ఉన్నాయి.
కొత్తగా ప్రారంభించబడిన, విశాలమైన రోగనిర్ధారణ కేంద్రం లో 2500 కంటే ఎక్కువ పరీక్షల యొక్క సమగ్ర జాబితాను అందిస్తుంది, ఇది అత్యంత అనుభవజ్ఞులైన పాథాలజిస్టుల పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది. ఈ ల్యాబ్‌లో క్లినికల్ బయోకెమిస్ట్రీ, హెమటాలజీ, ఫ్లో సైటోమెట్రీ, క్లినికల్ పాథాలజీ, సెరోలజీ, ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీ, సైటాలజీ, హిస్టోపాథాలజీ, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ, మాలిక్యులర్ డయాగ్నసిస్, ఎన్‌జిఎస్, సైటోజెనెటిక్స్ తదితర అంశాల్లో డయాగ్నస్టిక్ పరీక్షలను అందిస్తారు. ఈ సేవలు వివిధ అవయవాలు మరియు శరీర భాగాలపై ప్రభావం చూపే వివిధ వ్యాధుల నిర్ధారణ మరియు గుర్తించడంలో సహాయపడతాయి, చికిత్సా నియమావళిని నిర్ణయించడానికి వైద్యులకు ఇవి చాలా ముఖ్యమైనవి.
అంపత్ , చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ , డాక్టర్ మనీష్ బగై మాట్లాడుతూ , “విజయవాడలో మా సరికొత్త ల్యాబ్‌ను ప్రారంభించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా లక్ష్య సాధనకు అనుగుణంగా పని చేస్తూ, ప్రముఖ మార్కెట్‌లలో ఒకటైన విజయవాడ లో మా కార్యకలాపాలను విస్తరించినందుకు మేము గర్విస్తున్నాము మరియు ఇప్పుడు మా ఆటోమేటెడ్ & అత్యుత్తమ శ్రేణి , అధిక నాణ్యత ప్రమాణాలతో కూడిన అధునాతన పరీక్ష ప్రొఫైల్‌తో విజయవాడ ప్రజలకు సేవ చేయగలుగుతాము. దక్షిణాసియా లో ప్రమాణాల ఆధారిత , నిర్దిష్టమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించటం లో అంపత్ ముందుంది . మేము మా కార్యకలాపాలన్నింటిలో అగ్రశ్రేణి సేవలు, ఆవిష్కరణలు మరియు నాణ్యమైన ఫలితాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాము" అని అన్నారు.
ఈ నగర మరియు గుంటూరు, నర్సారావుపేట, తెనాలి, గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, నర్సీపట్నం, అనకాపల్లి, రాజమండ్రి , విజయనగరం, శ్రీకాకుళం వంటి పట్టణాల నివాసితులు సుసంపన్నమైన ల్యాబ్ సదుపాయం అందించే ప్రపంచ స్థాయి డయాగ్నస్టిక్ సేవల నుండి ప్రయోజనం పొందుతారు. అత్యంత మారుమూల ప్రాంతాలలో కూడా ప్రజలకు నాణ్యమైన డయాగ్నస్టిక్స్ సేవలను అందుబాటులోకి తెస్తూ, దక్షిణాది లో అంపత్ కలెక్షన్ సెంటర్ నమూనాను అందిస్తోంది.
అంపత్, ల్యాబ్ ఆపరేషన్స్ హెడ్ - డాక్టర్ పంకజ్ కర్వా మాట్లాడుతూ, “కొత్త ల్యాబ్‌ను ప్రారంభించడం మరియు దక్షిణాదిలో మా కార్యకలాపాలను విస్తరించడం పట్ల మేము సంతోషిస్తున్నాము, ఇక్కడ మేము విస్తృతమైన రోగనిర్ధారణ పరీక్షలను అందిస్తాము. హైటెక్ పరికరాలు మరియు నిష్ణాతులైన నిపుణుల బృందంతో, నాణ్యమైన మరియు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలతో మా కస్టమర్‌లకు నిరంతరం మరియు సమర్ధవంతంగా సేవలందించగలమని మేము ఆశిస్తున్నాము" అని అన్నారు.
అంపత్ కు హైదరాబాద్‌లో సెంట్రల్ రిఫరెన్స్ లేబొరేటరీ ఉంది, అలాగే వివిధ ప్రదేశాలలో 14 శాటిలైట్ ల్యాబ్‌లు ఉన్నాయి. ఇది NABL (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్) గుర్తింపు పొందింది మరియు యునైటెడ్ స్టేట్స్‌లోని అగ్రశ్రేణి ఆసుపత్రులలో ఒకటైన యూనివర్సిటీ అఫ్ పిట్స్‌బర్గ్ మెడికల్ సెంటర్ (UPMC)తో భాగస్వామ్యం కలిగి వుంది, ఇది అంపత్‌లోని సాంకేతిక బృందాన్ని ప్రపంచం లో అత్యుత్తమ వైద్యులతో కలిసి పనిచేయడానికి అవకాశమందిస్తుంది మరియు సమగ్ర మైన ల్యాబ్ సేవలను అందించడంలో వారికి సహాయపడుతుంది . ప్రఖ్యాతి గాంచిన గ్లోబల్ మెడికల్ ఆర్గనైజేషన్‌తో కలిసి పనిచేసే ప్రత్యేక గౌరవం కలిగిన ఏకైక భారతీయ ల్యాబ్ ఇది. UPMC యొక్క నిపుణుల మార్గదర్శకత్వంలో అభివృద్ధి చేయబడిన పరీక్షా విధానాలు మరియు నాణ్యత మార్గదర్శకాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా ఉంచడానికి తోడ్పడతాయి . ప్రపంచ స్థాయి సేవలను అందించడం మరియు ఖచ్చితమైన రోగనిర్ధారణ అనే దాని మిషన్‌కు దగ్గరగా ప్రయత్నిస్తున్న అంపత్, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో తమ విస్తరణకు సహాయపడటానికి అనేక ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది.