ఈ రామాంజనేయుల బొమ్మ గీసింది ఎవరో తెలుసా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Aug 2020 4:05 AM GMT
ఈ రామాంజనేయుల బొమ్మ గీసింది ఎవరో తెలుసా..?

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం కొన్ని కోట్ల మంది కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎప్పటికైనా అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తీ అవుతుందని హిందూ బంధువులు ఎదురుచూశారు. అనుకున్నట్లుగానే ఆగష్టు 5న రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు తమకు నచ్చిన విధంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి సమయంలో సామాజిక మాధ్యమాల్లో శ్రీరాముడు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్న స్కెచ్ బాగా వైరల్ అయ్యింది. ఆ స్కెచ్ గీసింది మరెవరో కాదు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం.బ్రహ్మానందం మంచి మంచి కళాఖండాలను గతంలో కూడా గీశారు. అవి నెటిజన్లకు తెగ నచ్చేసాయి. బ్రహ్మానందం అయోధ్యలో రామ మందిరం నిర్మాణ శంకుస్థాపనను పురస్కరించుకుని ఈసారి శ్రీరాముడు హనుమంతుడు గీసిన చిత్రం వైరల్ అవుతోంది. శ్రీరాముడు ఆప్యాయంగా హనుమంతుడిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నట్టుగా ఉన్న చిత్రాన్ని బ్రహ్మానందం గీశారు. ఆయనలోని కళాకారుడిని పలువురు ప్రశంసిస్తున్నారు. బ్రహ్మానందం నటనలోనే కాదు.. ఇలాంటి కళాఖండాలను గీయడంలో కూడా మీకు మీరే సాటి అని ప్రశంసిస్తూ వచ్చారు నెటిజన్లు.

Next Story