కడప జిల్లాలో విషాదం.. తండ్రి మరణాన్ని తట్టుకోలేక.. అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Aug 2020 7:14 AM GMT
కడప జిల్లాలో విషాదం.. తండ్రి మరణాన్ని తట్టుకోలేక.. అక్కా చెల్లెళ్ల ఆత్మహత్య

ఇద్దరు కుమారైలను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆ తండ్రి. మంచి సంబంధం అని చెబితే.. పెద్ద కూతురికి పెళ్లి చేశాడు. అల్లుడు తన కుమారైను పెట్టే ఇబ్బందులు చూడలేక ఆ తండ్రి మనస్థాపానికి గురైయ్యాడు. సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు అల్లుడే కారణమని ఆ వీడియోలో తెలిపాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఆ ఇద్దరు కూతుళ్లు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. బాబురెడ్డి ఎలక్ర్టికల్‌ కాంట్రాక్టర్‌గా పని చేస్తూ.. ప్రొద్దుటూరులోని వైఎంఆర్‌ కాలనీలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన శ్వేత, సాయి అనే ఇద్దరు కుమారైలు ఉన్నారు. ఆయన పెద్ద కుమారై శ్వేతకు పెళ్లైంది. అయితే.. శ్వేతను ఆమె భర్త నిత్యం వేదింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని శ్వేత తండ్రితో చెప్పి ఏడ్చింది. కుమారైను అల్లుడు ఇబ్బంది పెట్టడాన్ని తట్టుకోలేక పోయాడు బాబురెడ్డి. ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు సెల్పీ వీడియో రికార్డ్‌ చేశాడు. అందులో తన చావుకు తన అల్లుడు సురేష్‌ రెడ్డి కారణమని పేర్కొన్నాడు.

తండ్రి మరణవార్తను జీర్ణించుకోలేని అతడి ఇద్దరు కూతుళ్లు.. ఎర్రగుంట్ల మండలం తిప్పటూరు-రాణిపేట మధ్యగల రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఒక రోజు వ్యవధిలో ఒకే కుటుంబంలోని తండ్రీ, కూతుళ్లు బలవన్మరణానికి పాల్పడడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Next Story
Share it