వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్‌ నోటీసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2020 2:30 PM IST
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్‌ నోటీసులు

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని షోకాజ్‌ నోటీసుల్లో పేర్కొంది. అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సొంత పార్టీని కించపర్చేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా సీఎం జగన్‌పై కూడా పలు వ్యాఖ్యలు చేశారని, అనేక సందర్భాలలో ఆయన మీడియా ముందు పార్టీ, ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేశారన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆయన ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని, తాను చేసిన వ్యాఖ్యలన్నింటికీ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంటూ ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు వైసీపీ పేర్కొంది.

CamScanner 06-23-2020 19.59.05

Next Story