కూచిపూడి నృత్యకారిణి శోభా నాయుడు కన్నుమూత
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Oct 2020 9:27 AM ISTప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభా నాయుడు 12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో అరంగేట్రం చేశారు.
వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరిన ఆమె వెంపటి నృత్య రూపాలలో అన్ని పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించిన శోభా నాయుడు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని స్థాపించి దాదాపు 40 ఏళ్ల పాటు వేల మందికి కూచిపూడిలో శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఆమె లేరనే వార్త విని ఆమె శిష్యులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈమె మరణం విని షాకైన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Also Read
మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కన్నుమూతNext Story