ఘోర రోడ్డు ప్ర‌మాదం.. గర్భిణీ స్త్రీ సహా ఏడుగురు దుర్మ‌ర‌ణం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2020 7:19 AM GMT
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. గర్భిణీ స్త్రీ సహా ఏడుగురు దుర్మ‌ర‌ణం

కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుకు పక్కన ఆపి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మరణించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప‌న్ర‌కారం.. ఆదివారం తెల్లవారుజామున కలబురగి జిల్లాలోని సవలగి గ్రామ సమీపంలో రోడ్డు ప‌క్క‌కు ఆపి ఉన్న ట్రక్కును.. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో గర్భిణీ స్త్రీ సహా ఏడుగురు మరణించారు.

ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారంతా అలండ్‌ తాలుకాలోని ఒకే గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిని.. ఇర్ఫాన్‌ బేగం (25), రూబియా బేగం (50), అబెదాబీ బేగం (50), జయజునాబీ (60), మునీర్ (28), మహ్మద్ అలీ (28), షౌకత్ అలీ (29)గా గుర్తించారు. వీరంతా గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించడానికి కలబురగికి వస్తున్నట్లు తెలుస్తోంది. స‌మాచారం అందిన వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it