విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో ఏడుగురి అరెస్ట్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 July 2020 2:29 PM GMT
విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో ఏడుగురి అరెస్ట్‌

గుంటూరు : జిల్లాకు చెందిన బీటెక్‌ విద్యార్థిని నగ్నచిత్రాలను సోషల్ ‌మీడియాలో అప్‌లోడ్‌ చేసిన కేసులో మరో మరో ఏడుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నగ్నచిత్రాలు తీసిన వరుణ్, వాటిని పోర్న్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన కౌశిక్‌లను దిశా పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు.

విద్యార్థిని ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించి బాధితురాలి దగ్గర నుంచి డబ్బు గుంజేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు నిర్ధారించారు. అలాగే విద్యార్థిని న్యూడ్ వీడియోలను మణికంఠ అనే వ్యక్తి ఇన్‌స్ట్రాగామ్ ఖాతా నుంచి పోస్ట్‌ చేసినట్లు తేలింది. ఈ ఘటనలో వరుణ్, కౌశిక్‌ల తరువాత మణికంఠ, ధనుంజయ్ రెడ్డిలు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు.

‘మైనేమ్ ఈజ్ 420’ అనే పేరుతో మణికంఠ ఓ న‌కిలీ ఇన్‌స్టా ఖాతాను ఓపెన్ చేశాడు. బాధితురాలి నగ్న వీడియోలను ఆసరాగా చేసుకుని మరింత మంది అమ్మాయిలు వీడియోలు పంపాలని వత్తిడి చేశాడు. ఈ క్రమంలోనే వారి బండారం బయటపడింది. నిందితులు ఉపయోగించిన లాప్‌టాప్, ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ ఇంకా కొనసాగుతోందని త్వరలోనే అభియోగపత్రం దాఖలు చేస్తామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

Next Story
Share it