8 ఏళ్ల ఇద్దరు చిన్నారులపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

By సుభాష్  Published on  6 July 2020 5:31 AM GMT
8 ఏళ్ల ఇద్దరు చిన్నారులపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

అభం శుభం తెలియని చిన్నారులపై ఓ కీచకుడు దారుణంగా ప్రవర్తించడం సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. నిజామాబాద్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎడపల్లి మండలం జాన్కంపేటలో 8 ఏళ్ల ఇద్దరు చిన్నారులపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నారాయణ (55) అనే వ్యక్తి గత పదిహేను రోజులుగా చాక్లెట్‌ ఆశ చూపించి పాడుబడ్డ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని చిన్నారులను బెదిరించాడు.

అయితే చిన్నారులకు కడుపునొప్పి రావడంతో అసలు విషయాన్ని కుటుంబ సభ్యులతో తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నారాయణను పట్టుకుని దేహశుద్ది చేశారు. అనతరం పోలీసులకు అప్పగించారు. ఇద్దరు చిన్నారులను చికిత్స నిమిత్తం బోధన్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, ఇలా చిన్నారులపై దేశంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనపై పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. కామాంధుల్లో తీరు ఏ మాత్రం మారడంలేదు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని జైలు పాలవుతున్నా.. ఇలాంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి.

Next Story
Share it