ఆ మొబైల్ ఫోన్స్ లో ఇకపై వాట్సాప్ సపోర్ట్ చేయదు

WhatsApp to stop supporting older Android. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఇకపై కొన్ని మొబైల్ ఫోన్స్ లో సపోర్ట్ చేయదని

By Medi Samrat  Published on  24 Oct 2021 4:41 PM GMT
ఆ మొబైల్ ఫోన్స్ లో ఇకపై వాట్సాప్ సపోర్ట్ చేయదు

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఇకపై కొన్ని మొబైల్ ఫోన్స్ లో సపోర్ట్ చేయదని తెలుస్తోంది. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ త్వరలో పనిచేయడం మానేస్తుందని నిపుణులు తెలిపారు. నవంబర్ 1 నుండి వాట్సాప్ ఆండ్రాయిడ్ 4.1 కి ముందు వెర్షన్‌లో నడుస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్‌లకు సపోర్ట్ చేయదు. యాపిల్ డివైజ్ లలో అయితే వాట్సాప్ iOS 10 లోనూ, ఆ తర్వాత వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కొత్త వెర్షన్లలో పనిచేసే పరికరాలకు మాత్రమే మద్దతు ఇస్తుంది. నవంబర్ 1 తర్వాత KaiOS 2.5.0 కి మాత్రమే మద్దతు ఇస్తుంది. కాబట్టి JioPhone మరియు JioPhone 2 వినియోగదారులు వాట్సాప్ ను ఉపయోగించడం జరుగుతుంది.

రాబోయే రోజుల్లో మరిన్ని ఫీచర్లను వాట్సాప్ తీసుకుని వస్తోంది. ఆడియో మెసేజ్ ప్రివ్యూ, వాట్సాప్ కమ్యూనిటీ, వాట్సాప్ ప్లేయర్, మీడియా అన్ డు, మల్టీ డివైస్ సపోర్ట్ వంటివి తీసుకుని వస్తోంది. వాట్సాప్ లో ఆడియో సందేశం రికార్డు చేసిన తర్వాత దాన్ని మనం విని కొన్ని మార్పులతో పంపొచ్చు. వాట్సాప్ లో పంపించే ఆడియో సందేశాలు వినేందుకు ప్లేయర్ ఫీచర్ లో మార్పులు చేస్తోంది వాట్సాప్ యాజమాన్యం. యూజర్లు పెద్ద సైజులో ఉండే ఆడియో సందేశాలను వింటూనే చాటింగ్ చేసే వెసులుబాటు ఈ ప్లేయర్ ఫీచర్ తో కలుగుతుంది. ఆడియో మెసేజ్ ను యూజర్లు పిన్ చేసి.. ఆ తర్వాత ప్లే చేస్తూ, ఇతరులతో చాట్ చేసుకోవచ్చు. ఒకే వాట్సాప్ ఖాతాను రెండు ఫోన్లలో ఉపయోగించుకునేలా మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్ తీసుకువస్తోంది .ఈ ఫీచర్ సాయంతో ఒకే వాట్సాప్ ఖాతాను ఫోన్ లోనూ, ట్యాబ్, డెస్క్ టాప్ పీసీలోనూ ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇది బేటా వెర్షన్ లో ఉంది.


Next Story