వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు

Whatsapp New features. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిండ్, ఐఫోన్ యూజర్లకు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు

By Medi Samrat  Published on  12 July 2021 8:02 AM GMT
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిండ్, ఐఫోన్ యూజర్లకు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు తీసుకురాబోతోంది. రీడిజైన్డ్ ఇన్ యాప్ నోటిఫికేషన్స్, వాట్సాప్ వాయిస్ వేవ్‌ఫామ్స్, వ్యూ వన్స్ ఫీచర్ లను తీసుకుని వస్తోంది. వాట్సాప్ కు కూడా ఇటీవలి కాలంలో పోటీ పెరిగిపోతూ ఉండడం, మార్కెట్ లోకి ఎన్నో మెసేజింగ్ యాప్స్ వస్తూ ఉండడంతో తన వినియోగదారులను అంటిపెట్టుకోడానికి వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను తీసుకుని వస్తూ ఉంది.

వ్యూ వన్స్ ఫీచర్:

మనం ఎవరికైనా మెస్సేజ్, ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ మెస్సేజ్, జీఐఎఫ్ ఇమేజ్ పంపితే అవతలి వ్యక్తులు వాటిని ఓపెన్ చేసి ఎన్నిసార్లయినా చూసుకోవచ్చు. వ్యూ వన్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక మీరు పంపించే మెస్సేజ్, వీడియోలు, పొటోలు ఏదైనాగానీ అవతలి వ్యక్తి ఒకసారి చూపి చాట్ నుంచి బయటకు వస్తే చాలు ఆ సమాచారం మాయం అవుతుంది. మెస్సేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి టెక్ట్స్, ఫొటో, జీఐఎఫ్ మెస్సెజ్‌లను స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం మాత్రం ఉంటుంది.

రీడిజైన్డ్ ఇన్ యాప్ నోటిఫికేషన్స్:

వాట్సాప్‌ను రీడిజైన్ చేయడానికి కంపెనీ నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం యాప్ నోటిఫికేషన్లలో ఎన్నో మార్పులు తీసుకుని వస్తోంది. నోటిఫికేషన్ బ్యానర్‌, ఫొటోలు, వీడియోలు, జీఐఎఫ్ మరియు స్టిక్కర్లలో మరింత సమాచారం అందించనుంది. యాప్ నోటిఫికేషన్‌ను వాట్సాప్ యూజర్లు పెద్దదిగా చేసుకుని ఛాట్ ప్రివ్యూ కూడా చెక్ చేసుకునే సదుపాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తోంది.

వాట్సాప్ వాయిస్ వేవ్‌ఫామ్స్ :

వాయిస్ మెస్సేజ్‌లు వింటున్న సమయంలో వాయివ్ అనేది వేవ్‌ఫామ్ రూపంలో కనిపిస్తుంది. ఇప్పటివరకూ వాయిస్ మెస్సేజ్ వింటుంటే బార్ ముందుకు వెళ్తుంది. కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే తరంగాల రూపంలో మెస్సేజ్ డిస్‌ప్లే అవుతుంది. వాట్సాప్ బీటా ప్రకారం ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు సిద్ధంగా ఉంది. ఐఓఎస్ యూజర్లకు ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా మరెన్నో ఫీచర్లను తీసుకుని రావడానికి వాట్సాప్ ప్రయత్నాలు చేస్తూ ఉంది.


Next Story