గూగుల్ క్రోమ్ వాడుతున్నారా.. జాగ్రత్త అని అంటున్న భారత ప్రభుత్వం

Update Google Chrome now as Government advises caution. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను చాలా మంది విపరీతంగా వినియోగిస్తూ ఉన్నాం. కాబట్టి క్రోమ్

By Medi Samrat  Published on  15 Dec 2021 5:31 PM IST
గూగుల్ క్రోమ్ వాడుతున్నారా.. జాగ్రత్త అని అంటున్న భారత ప్రభుత్వం

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను చాలా మంది విపరీతంగా వినియోగిస్తూ ఉన్నాం. కాబట్టి క్రోమ్ వినియోగదారులకు ఓ ముఖ్యమైన విషయం ఇది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. క్రోమ్‌లోని బగ్ వినియోగదారుల గోప్యతను, అలాగే పరికరంలోకి మాల్వేర్ చొరబడే ప్రమాదానికి దారి తీస్తోందని స్పష్టం చేశారు. తాజాగా సమాచారం ప్రకారం, Google ఈ లోపాన్ని సరిదిద్దింది.. దాని కోసం ఒక అప్ డేట్ ను జారీ చేసింది. ప్రభుత్వంతో పాటు గూగుల్ కూడా కొత్త అప్డేటెడ్ క్రోమ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని వినియోగదారులను ఆదేశించింది. ఈ సరి కొత్త అప్డేట్ 22 భద్రతా పరిష్కారాలను(security fixes) అందిస్తుంది. ఈ లోపాలను రీసెర్చర్లు Google దృష్టికి తీసుకుని వెళ్లారు.

CERT-In నివేదిక ప్రకారం, హ్యాకర్లు వినియోగదారుల ప్రైవేట్ సమాచారాన్ని సేకరించి.. వేరే విధంగా ఉపయోగించవచ్చు. వారు పరికరంలోకి మాల్వేర్‌ను ఇంజెక్ట్ చేయవచ్చు, ఇది మరింత నష్టాన్ని కలిగిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ ఒక ప్యాచ్‌ను విడుదల చేసింది. వీలైనంత త్వరగా తమ బ్రౌజర్‌ను అప్‌గ్రేడ్ చేయాలని వినియోగదారులను కోరింది.

Google ను ఇలా అప్డేట్ చేసుకోండి

Go to Google Chrome's settings

Go to the About section of Google Chrome in Help

Check out your Chrome version here

If you have an update, update it.


Next Story