భారత్ లో ఒకప్పుడు టిక్ టాక్ ఎంతగా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది టిక్ టాక్ వీడియోలను చూడడం.. టిక్ టాక్ లో తమ టాలెంట్ ను చూపించేయడం జరిగింది. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యి.. ఎంతో మంది కెరీర్ లు కూడా నిలబడ్డాయి. అయితే టిక్ టాక్ చైనాకు చెందిన యాప్ కావడం.. భారతీయుల డేటాకు భద్రత లేకపోవడంతో యాప్ ను మన దగ్గర బ్యాన్ చేశారు. ఇక రీఎంట్రీ ఇవ్వాలని టిక్ టాక్ సంస్థ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. దీంతో టిక్ టాక్ ఓనర్లయిన బైట్‌డ్యాన్స్ సంస్థ ఇప్పుడు దానికి సంబంధించిన ఏఐ టెక్నాలజీని అమ్మేస్తోంది. భారత్ కు చెందిన కంపెనీలు కూడా టిక్‌టాక్ టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బైట్ ప్లస్ పేరుతో టిక్‌టాక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు చెందిన సోషల్ గేమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లకు అమ్ముతోంది. గేమ్స్‌యాప్ లాంటి సంస్థతో పాటు ఫ్యాషన్ యాప్ గోట్, సింగపూర్ ట్రావెల్ సైట్ వీగో, ఇండోనేషియా షాపింగ్ యాప్ చిలీబిలీ లాంటి వాటికి కూడా టిక్‌టాక్ తన టెక్నాలజీని ట్రాన్స్‌ఫర్ చేయనున్నది. టిక్ టాక్ స్థానాన్ని భర్తీ చేయడానికి పలు యాప్స్ భారత మార్కెట్ లోకి వచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి.