తప్పిన భారీ సౌర తుఫాను ముప్పు
Solar Storm 2021. ఓ భారీ సౌర తుఫాను భూమి వైపు దూసుకొస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సమాచార
By Medi Samrat Published on 15 July 2021 7:38 PM ISTఓ భారీ సౌర తుఫాను భూమి వైపు దూసుకొస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సమాచార వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపనున్నట్లు అంచనా వేస్తున్నారు. అమెరికాకు చెందిన Spaceweather.com ప్రకారం, సౌర తుఫానుల కారణంగా, భూమి బయటి వాతావరణం వేడిగా మారవచ్చనే హెచ్చరికలు వచ్చాయి. ఇది శాటిలైట్స్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని.. ఇది జీపీఎస్ నావిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నల్, శాటిలైట్ టీవీలపై ప్రభావం చూపనుందని భావించారు. అయితే ఈ ముప్పు నుండి బయటపడ్డామని తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
16 లక్షల కిలో మీటర్ల వేగంతో దూసుకొచ్చిన సౌర తుపాను ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండానే వెళ్లిపోయిందని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం భూమిపైకి వచ్చిన సౌర తుఫాను కొన్ని గంటల పాటు ఉండి వెళ్లిందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిపై దీని వలన ఎలాంటి గుర్తించదగిన మార్పులు చోటు చేసుకోలేదని.. భూ అయస్కాంత క్షేత్రంలో మాత్రం కొద్దిగా మార్పులు సంభవించాయని అమెరికన్ ఏజెన్సీ తెలిపింది. నేషనల్ ఓషియానిక్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) హెచ్చరిక ప్రకారం.. 16:41 యుటీసీ(22:11 ఐఎస్ టీ) సమయం వద్ద భూమికి సమీపంగా వచ్చిన సౌర తుపాను భూ అయస్కాంత కె-ఇండెక్స్ 4తో ప్రయాణించింది.
భూ అయస్కాంత తుఫానుల పరిమాణాన్ని వర్ణించడానికి కె-ఇండెక్స్ ను ఉపయోగిస్తారు. కె-ఇండెక్స్ 4లో 4 అనేది చిన్న అంతరాయాన్ని సూచిస్తుంది. సౌర తుఫాను కారణంగా పవర్ గ్రిడ్, ఇంటర్ నెట్ లో సమస్యలు తలెత్తుతాయని, కెనడా, అలాస్కా వంటి అధిక అక్షాంశాల వద్ద అరోరాలు కనిపిస్తాయని ఎన్ఓఏఏ తెలిపింది. కానీ స్థానిక యుఎస్ మీడియా అటువంటి ఏవి కనబడినట్లు పేర్కొనలేదు. 2015లో వచ్చిన సౌర తుపాను ఆమెరికాకు ఈశాన్యంలో ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థలను దెబ్బ తీసింది. ఇప్పుడు కూడా అలాంటిదే సంభవిస్తుందని అనుకున్నా.. ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.
మరోవైపు సూర్యుడి ఉపరితలంపై పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా 2025లో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటే భూమి వినాశనానికి దారితీయొచ్చునని హెచ్చరిస్తున్నారు. 2017లో, సౌర తుఫాను 5 హరికేన్ ఇర్మా కరేబియన్ దిశగా దూసుకెళ్లింది. 2015లో, సౌర తుఫానులు అమెరికా ఈశాన్యంలో గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థలను ఢీకొట్టాయి. మార్చి 1989 లో, క్యూబెక్ ప్రావిన్స్ మీద సౌర తుఫాను వ్యాప్తంగా తొమ్మిది గంటలు కొనసాగింది.