మొదలైన సౌర తుఫాను టెన్షన్..!

Powerful solar storm approaching Earth. భారీ సౌర తుఫాను.. ఇది మనల్ని టెన్షన్ పెట్టే అంశమే..! అతి త్వరలోనే రాబోతోంది.

By Medi Samrat  Published on  11 July 2021 4:41 PM IST
మొదలైన సౌర తుఫాను టెన్షన్..!
భారీ సౌర తుఫాను.. ఇది మనల్ని టెన్షన్ పెట్టే అంశమే..! అతి త్వరలోనే రాబోతోంది. ఓ భారీ సౌర తుఫాను భూమి వైపు దూసుకొస్తోంది. స‌మాచార వ్య‌వ‌స్థ‌పై ఇది తీవ్ర ప్ర‌భావం చూపనున్నట్లు అంచ‌నా వేస్తున్నారు. అమెరికాకు చెందిన Spaceweather.com ప్రకారం, సౌర తుఫానుల కారణంగా, భూమి బయటి వాతావరణం వేడిగా మారవచ్చు. ఇది శాటిలైట్స్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది జీపీఎస్ నావిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నల్, శాటిలైట్ టీవీలపై ప్రభావం చూపనుంది. ఈ సౌర మంట‌ల కార‌ణంగా ప‌వ‌ర్ గ్రిడ్ల‌పైనా ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.


ఈ నెల 3న శాస్త్రవేత్తలు ఓ భారీ సోలార్ ఫ్లేర్‌ను గుర్తించారు. ఇది భూవాతావ‌ర‌ణంవైపు చాలా వేగంగా దూసుకొస్తోంది. ఇది సూర్యుడి వైపు ఉన్న భూమిపై స‌బ్‌-సోలార్ పాయింట్‌లో కేంద్రీకృత‌మైన‌ట్లు స్పేస్ వెద‌ర్ ప్రెడిక్ష‌న్ సెంట‌ర్ వెల్ల‌డించింది. ఇది హైఫ్రీక్వెన్సీ రేడియో క‌మ్యూనికేష‌న్‌ల బ్లాకౌట్‌కు కార‌ణం కావ‌చ్చ‌ని అంచ‌నా వేసింది. ఓ గంట పాటు హై ఫ్రీక్వెన్సీ రేడియో క‌మ్యూనికేష‌న్ పని చేయకపోయే అవ‌కాశం ఉన్న‌ద‌ని తాజాగా ఈ స్పేస్ వెద‌ర్ ప్రెడిక్ష‌న్ సెంట‌ర్ తెలిపింది. ఈ సౌర మంట‌ల‌కు ఈ సెంట‌ర్ ఎక్స్‌1 లెవ‌ల్‌గా గుర్తించింది. నాసా ఇది భూమి వైపు గంట‌కు 16 ల‌క్ష‌ల కి.మీ. వేగంతో దూసుకొస్తున్న‌ట్లు తెలిపింది. ఈ వేగం మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉందని నాసా అంచ‌నా వేసింది. దీని కార‌ణంగా భూమి ఎగువ వాతావ‌ర‌ణంలోని శాటిలైట్ల‌పై ప్ర‌భావం ప‌డ‌నుంది. ఇది నేరుగా జీపీఎస్ నేవిగేష‌న్ వ్య‌వ‌స్థ‌, మొబైల్ ఫోన్ సిగ్న‌ల్‌, శాటిలైట్ టీవీల‌పై ప్ర‌భావం చూపుతుంది.

సూర్యుడి ఉపరితలంపై పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా 2025లో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటే భూమి వినాశనానికి దారితీయొచ్చునని హెచ్చరిస్తున్నారు. 2017లో, సౌర తుఫాను 5 హరికేన్ ఇర్మా కరేబియన్ దిశగా దూసుకెళ్లింది. 2015లో, సౌర తుఫానులు అమెరికా ఈశాన్యంలో గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థలను ఢీకొట్టాయి. మార్చి 1989 లో, క్యూబెక్ ప్రావిన్స్ మీద సౌర తుఫాను వ్యాప్తంగా తొమ్మిది గంటలు కొనసాగింది. సౌర తుఫానులు పైలట్లకు ఇబ్బందులు తీసుకుని రావచ్చని, మహిళా సిబ్బందిలో గర్భస్రావ సమస్యలు అధికంగా ఉండే ముప్పు ఉందని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యలు ఈ సౌర తుఫానులు తీసుకుని వచ్చే అవకాశం ఉంది.


Next Story