సంజు శాంసన్ పై వేటు.. కివీస్ పర్యటనకు భారత టీ20 జట్టు ఎంపిక
By Newsmeter.Network Published on 13 Jan 2020 10:25 AM ISTసొంత గడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా న్యూజిలాండ్ విమానం ఎక్కనుంది. న్యూజిలాండ్ తో 5 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టుల్లో తలపడనుంది. కివీస్ పర్యటనలో ఆతిథ్య జట్టుతో ఆడే ఐదు టీ20ల సిరీస్ కోసం 16 మందితో కూడిన భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. మొత్తం అన్ని ఫార్మాట్లకు జట్టును ఎంపిక చేస్తారని అనుకున్నా.. చివరికి టీ20 జట్టును మాత్రమే ఎంపిక చేశారు.
గత మూడు సిరీస్‌లుగా జట్టులో ఉంచి ఒకే ఒక్క మ్యాచ్ ఆడించిన కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ పై వేటు పడింది. లంకతో చివరి మ్యాచ్ లో శాంసన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటైయ్యాడు. లంకతో సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ జట్టులోకి తిరిగొచ్చారు. హార్థిక్ పాండ్యా గాయంతో శుభం దూబే తన కాపాడుకున్నాడు. కివీస్‌లో ఐదు టి20లు ఈ నెల 24, 26, 29, 31, ఫిబ్రవరి 2 తేదీల్లో జరుగున్నాయి.
టీ20 జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, శివం దూబే, కుల్దీప్ యాదవ్, చాహల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్.