మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ క‌ప్ కు భార‌త జ‌ట్టు ఎంపిక‌

By Newsmeter.Network  Published on  12 Jan 2020 10:50 AM GMT
మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ క‌ప్ కు భార‌త జ‌ట్టు ఎంపిక‌

ఆస్ట్రేలియా వేదిక‌గా ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగే మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ క‌ప్ కు భార‌త జ‌ట్టును ఆదివారం బీసీసీఐ ప్ర‌క‌టించింది.

అలాగే మెగాటోర్నీకి సన్నాహకంగా నిర్వహించే ముక్కోణపు టీ20 టోర్నీకి కూడా భారత జట్టును ఎంపిక చేశారు. హర్మన్‌ప్రీత్ కౌర్ ‌నేతృత్వంలో 15 మంది సభ్యులతో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించారు. రిచా ఘోష్ అనే కొత్త ప్లేయర్ కి జట్టులో చోటు ద‌క్కింది. ప్ర‌పంచ‌క‌ప్ లో భారత్ గ్రూప్‌-ఎలో చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్ లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇక గ్రూప్‌-బిలో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, థాయ్‌లాండ్ ఉన్నాయి.వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఆసీస్‌లోనే నిర్వహిస్తున్న ముక్కోణఫు టీ20 టోర్నీకి కూడా 16 మందితో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో భారత్ ఈ టోర్నీ అడుగుతుంది. ఈనెల 31 నుంచి వచ్చేనెల 12 వరకు మెల్‌బోర్న్‌లో ఈ టోర్నీ జరుగుతుంది.

ప్రపంచకప్‌కు భారతజట్టు : హర్మన్‌ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి.

టీ20 సిరీస్‌కు భారతజట్టు : హర్మన్‌ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి. పర్వీన్.

Next Story