పంత్ మ‌హాముదురు.. మాజీ ప్రేయ‌సిని బ్లాక్ లో పెట్టి.. కొత్త భామ‌తో..

By Newsmeter.Network  Published on  11 Jan 2020 2:17 PM GMT
పంత్ మ‌హాముదురు.. మాజీ ప్రేయ‌సిని బ్లాక్ లో పెట్టి.. కొత్త భామ‌తో..

క్రికెట‌ర్ల‌కు, బాలీవుడ్ బామ‌ల‌కు మ‌ధ్య ల‌వ్ అపైర్లు కొత్తేం కావు. కొంద‌రు త‌మ బంధాన్ని పెళ్లి పీట‌ల వ‌ర‌కు తీసుకెళ్లినా మ‌రి కొంద‌రు మ‌ధ్యలోనే త‌మ బంధానికి పుల్ స్టాఫ్ పెట్టేస్తున్నారు. భారత మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని వార‌సుడిగా కితాబులందుకుంటున్న రిష‌బ్ పంత్ ఆ రెండో కోవ‌లోకే వ‌చ్చాడు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాతో చెట్టాప‌ట్టాలేసుకు తిరిగిన ఈ వికెట్ కీప‌ర్ తాజాగా త‌మ బంధానికి స్వ‌స్తి ప‌లికిన‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల ఫామ్ కోల్పోయి టీంలో ప్లేస్ ప్ర‌శ్నార్థం చేసుకున్న రిష‌బ్ పంత్ ఇక పూర్తిగా క్రికెట్ పైనే దృష్టి సారించాడు. ఇక పంత్ చేసిన ఓ పని మూలంగా వీరిద్ద‌రి మ‌ధ్య బంధానికి బ్రేక్ ప‌డిన‌ట్లు తెలుస్తోంది. సోష‌ల్ మీడియాలో అమ్మ‌డిని మ‌నోడు బ్లాక్ చేశాడ‌ట‌. వెస్టిండీస్ తో సిరీస్ వ‌ర‌కు అమ్మ‌డితో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగాడు పంత్. మ‌రీ ఏ విష‌యంలో బెడిసి కొట్టిందో తెలియ‌దు కాని ఈ బాలీవుడ్ భామ‌ని దూరం పెట్టేశాడట‌.

కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా త‌న గ‌ర్ల్ ప్రెండ్ ఇషా నెగితో కలిసి పంత్ వెకేషన్‌కు వెళ్లాడు. అంతేకాదు ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో సైతం పోస్టు చేశాడు. దీంతో పంత్ - ఊర్వశి రౌతేలా మ‌ధ్య బెడిసి కొట్టింద‌ట‌. త‌రువాత ఈ బాలీవుడ్ భామ ఎంత ప్ర‌య‌త్నించినా పంత్ స్పందించ‌డం మాని వేశాడ‌ట‌. వాట్స‌ప్ లో ప‌దే ప‌దే కాంటాక్ట్ కావ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో ఆమె నెంబ‌ర్ ను బ్లాక్ చేశాడట‌. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య బంధానికి పుల్ స్టాప్ ప‌డిన‌ట్లేన‌ని వీరిని ద‌గ్గ‌ర‌గా చూసిన ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం రిష‌బ్ పంత్ ఆస్ట్రేలియా తో వ‌న్డే సిరీస్ కోసం సిద్ద‌మ‌వుతున్నాడు.

Next Story
Share it