హైదరాబాద్: పవన్ కల్యాణ్‌తో బండి సంజయ్ భేటీ
By సుభాష్ Published on 25 May 2020 9:09 PM ISTజనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో వీరి సమావేశం జరిగింది. ఏపీలో బీజేపీ, జనసేన కలిసి పని చేస్తుండగా, ఈ పొత్తును కూడా తెలంగాణలో కూడా కొనసాగించాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పవన్, సంజయ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరో వైపు వీరి భేటీలో రాజకీయ కోణం ఏదీ లేదని, కేవలం మర్యాదపూర్వకంగానే కలిసినట్లు బీజేపీ నేతలు చెబుతున్న మాట. కాగా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర సారధిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్విట్టర్ ద్వారా పవన్ కల్యాన్ అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత పవన్‌తో భేటీ కావడం మొదటి సారి. ఇక ఢిల్లీ కేంద్రంగా జనసేన-బీజేపీ పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పని చేస్తాయని జనసేన-బీజేపీ ననేతలు అధికారికంగా ప్రకటించారు.