నీకిష్టమైన వదిన ఎవరు?.. బాబర్ సమాధానానికి సానియా సీరియస్
By Medi Samrat Published on 27 Jun 2020 8:30 AM ISTపాక్ స్టార్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫైర్ అయ్యింది. బాబర్ ఇచ్చిన ఓ సమాధానం సానియాకు కోపం తెప్పించింది. దీంతో ‘బాబర్.. నిన్ను చంపేస్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. ఇదంతా సీరియస్ అనుకోకండి.. సానియా మీర్జా భర్త, పాక్ సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్.. బాబర్ మధ్య జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్ సందర్భంగా జరిగిన ఓ సరదా సంభాషణ మాత్రమే.
లైవ్ చాట్ సందర్భంగా.. ‘నీకిష్టమైన వదిన ఎవరు’? అని షోయబ్ మాలిక్ అడిగిన ప్రశ్నకు.. బాబర్ ఆజమ్.. మాజీ కెప్టెన్, కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ భార్య అని చెప్పాడు. దీంతో ఆ లైవ్‌ను వీక్షిస్తున్న సానియా మీర్జా.. ‘ఐ విల్ కిల్ యూ’ అని మెసేజ్ పెట్టింది. అంతేకాదు ఇకముందు షోయబ్ ఇంటిలోని సోఫాను ఉపయోగించుకోకూడదని కూడా బాబర్‌పై చిరుకోపం ప్రదర్శించింది.