సిద్దిపేటలో హీరో సంపూర్ణేష్ బాబు కారు ప్ర‌మాదానికి గుర‌య్యింది. సంపూర్ణేష్ కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు కారులో సంపూర్ణేష్ తో పాటు భార్య‌, పిల్ల‌లు ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో సంపూర్ణేష్ భార్య‌, కూతురికి స్వ‌ల్ప గాయాలయ్యాయి. సిద్ధిపేట కొత్త బ‌స్టాండ్ ప్రాంతంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. స్థానికులు పోలీసులకి స‌మాచారం ఇవ్వ‌డంతో వెంట‌నే వారు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని సంపూ ఫ్యామిలీని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

‘హృద‌య‌కాలేయం’ సినిమా ద్వారా తెలుగు చిత్ర‌సీయ‌లోకి న‌టుడిగా ఎంట్రీ ఇచ్చి అన‌తి కాలంలోనే త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. త‌ర్వాత హీరోగా ‘సింగం123స‌, కొబ్బ‌రిమ‌ట్ట త‌దిత‌ర చిత్రాల‌లో న‌టించాడు. క‌మెడియ‌న్ గాను ప‌లు చిత్రాల‌లో న‌టిస్తూ బిజీ అయ్యాడు. సంపూర్ణేష్ స్వ‌స్థ‌లం సిద్దిపేట జిల్లా మిట్ట‌ప‌ల్లి గ్రామం.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.