నాగ‌ చైత‌న్య‌కు విడాకులిమ్మన్న నెటిజన్.. స‌మంత రిప్లై చూస్తే షాకే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2020 3:33 PM IST
నాగ‌ చైత‌న్య‌కు విడాకులిమ్మన్న నెటిజన్.. స‌మంత రిప్లై చూస్తే షాకే..!

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ల‌లో స‌మంత కూడా ఒక‌రు. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్‌పుల్‌గా కొనసాగిస్తూ ఫుల్ బిజీగా ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, బిజినెస్ ఇలా పలు రంగాల్లో రాణిస్తూ ఉంది. అలాగే.. నాగార్జున గైర్హాజ‌రుతో బిగ్ బాస్ హోస్ట్ బాధ్య‌త‌ల‌ను అందుకున్న స‌మంత దానిని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించింది.

వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మ‌నాలీ వెళ్లిన నాగ్ ద‌స‌రా మహా ఎపిసోడ్‌ని హోస్ట్ చేయాల్సిందిగా త‌న కోడ‌లు స‌మంత‌ని కోరాడు. దీనికి ఓకే చెప్పిన అక్కినేని కోడ‌లు స‌మంత‌.. మామ త‌న‌పై ఉంచిన బాధ్య‌త‌కు చ‌క్క‌టి న్యాయం చేసింది. అయితే.. తన కెరీర్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమంత సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తుంటుంది.

S1

అంతేకాదు.. నెటిజన్ల కామెంట్స్‌కు ఫన్నీగా సమాధానాలిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌కు సమంత తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. 'ఫీలింగ్ గుడ్' అంటూ సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేసింది. దీనికి స్పందించిన ఓ నెటిజన్.. 'చైతన్యకి విడాకులు ఇచ్చేయ్.. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం' అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు సమంత స్పందిస్తూ.. 'కష్టం.. ఒక పని చెయ్.. చైని అడుగు' అని రిప్లై ఇచ్చింది.

View this post on Instagram

☀️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Next Story