నాకంటూ పర్సనల్ స్పేస్ లేకుండా పోయిందని చెబుతున్న సమంత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 July 2020 2:12 PM IST
నాకంటూ పర్సనల్ స్పేస్ లేకుండా పోయిందని చెబుతున్న సమంత

సమంత అక్కినేని సాధారణంగా సామాజిక మాధ్యమాల్లో బాగా యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది. తన భర్త నాగ చైతన్యకు సంబంధించిన విషయాలను కూడా సమంత ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటుంది. సమంత మరొకరి గురించి కూడా ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లతో చెప్పుకుంటూ ఉంటారు.

సమంత తన పెంపుడు కుక్క 'హష్' గురించి ఎప్పుడు కూడా పోస్టు చేస్తూనే ఉంటుంది. కుక్కతో ఆడుకుంటున్న ఫోటోలు, తనతో పాటు ఉన్న ఫోటోలు.. ఈ మధ్య సమంత ఫోటో షూట్ లో కూడా హష్ ఎంతగానో సందడి చేస్తూ ఉన్నాడు. 'ప్రతి ఫోటోలో హష్ ఎంట్రీ ఏంటో' అంటూ నెటిజన్లు, మీమర్స్ పోస్టులు కూడా పెడుతున్నారు. సమంత పుట్టినరోజు నాడు హష్ తో కలిసి చెప్పించిన బర్త్ డే విషెష్ కూడా సామాజిక మాధ్యమంలో బాగా వైరల్ అయింది. శామ్, నాగ చైతన్యలు హష్ ను సొంత బిడ్డలా చూసుకుంటూ ఉన్నారు. వారిద్దరూ ఎక్కడ ఉంటే అక్కడికి హష్ చేరుకుంటోందట. చివరికి బెడ్ ను కూడా హష్ ఆక్రమించేసిందని చెబుతోంది సమంత. తాను బెడ్ మీద పడుకుని ఉంటే.. అక్కడే హష్ కూడా ఉన్న వీడియోను సమంత ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. నాకంటూ పర్సనల్ స్పేస్ అన్నది లేకుండా పోయిందని సమంత తెలిపింది.

సమంత ప్రస్తుతం పలు సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ కు కూడా ఓకె చెప్పింది. కరోనా కారణంగా ఏర్పడ్డ పరిస్థితుల వలన సమంత షూటింగ్ లకు దూరంగా ఉంది. ఆమె నటిస్తున్న వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 కొంత షూటింగ్ మినహా మిగతా పూర్తయ్యాయని అంటున్నారు. ఇప్పటికే డబ్బింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మనోజ్ బాజ్ పాయ్ ముంబైలో తన పోర్షన్ కు డబ్బింగ్ చెబుతూ ఉండగా, సమంత అక్కినేని హైదరాబాద్ లో డబ్బింగ్ చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్న రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ఎప్పటికప్పుడు జూమ్ కాల్స్ లో నటీనటులతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story