రోడెక్కనున్న సిటీ బస్సులు..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jun 2020 7:27 PM IST
రోడెక్కనున్న సిటీ బస్సులు..!

లాక్‌డౌన్‌ 5.0లో కేంద్రం సడలింపులు ఇవ్వడంతో హైదరాబాద్‌ నగరంలో తప్ప రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, పారిశ్రామిక కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీంతో కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షేర్‌ ఆటోల్లో ప్రయాణం సురక్షితం కాదు. దీంతో క్యాబ్‌లలో ప్రయాణించాలంటే వచ్చిన సంపాదంతా సరిపోవడం లేదని పలువురు

అంటున్నారు. ఎక్కువ మంది సొంత వాహానాలను రోడ్డెక్కించడంతో నగర ట్రాఫిక్‌ పెరిగిపోయింది.

సిటీ బస్సుల్లో ప్రతిరోజు 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిసాగుస్తున్నారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ మొదలు అయినప్పటి నుంచి బస్సులు నడవడం లేదు. బస్సులు ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాయోనని సిటీ ప్రజలు వేచిచూస్తున్నారు. బుధవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. నగరంలో బస్సులు ఎలా నడపాలి అన్న దానిపై చర్చించారు. జూన్‌ 8 నుంచి సిటీ బస్సులు నడపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం సిటీ బస్సు సర్వీసులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Next Story