ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌పై కేసు నమోదు..!

By అంజి  Published on  6 Jan 2020 9:18 AM GMT
ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌పై కేసు నమోదు..!

హైదరాబాద్‌: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ డిసెంబర్‌ 25న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జరిగిన సభలో దేశంలో ఉన్న 130 కోట్ల మంది హిందువులు అని అన్నారని, నిన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఇది సెక్యూలర్‌ దేశమని, ఇక్కడ అన్ని మతాల వారు ఉంటారని అన్నారని ఇందులో ఏది నిజమో చెప్పాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ వీహెచ్‌ హన్మంతరావు డిమాండ్‌ చేశారు. బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నది నిజమే అయితే మోహన్‌ భగవత్‌ మీద బీజేపీ చర్యలు తీసుకోవాలన్నారు. తాను ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. గత డిసెంబర్‌ 30వ తేదీన ఫిర్యాదు చేశానని.. ఇంకా ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలన్నారు.

రాహుల్‌ గాంధీ చౌకీదార్‌ చోర్‌ అన్నందుకు కేసు నమోదు చేశారు. క్షమాపణ చెప్పాలని బలవంతం చేశారు. మరి ఇప్పుడు మోహన్‌భగవత్‌పై కేసు ఎందుకు పెట్టరంటూ ప్రశ్నించారు. రేపు ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఉద్యమం చేస్తానన్నారు. రాహుల్‌కు ఒక న్యాయం, మోహన్‌ భగవత్‌కు ఒక న్యాయమా అంటూ వీహెచ్‌ మండిపడ్డారు. సుమోటోగా కేసులు నమోదు చేయవచ్చని కోర్టు చెప్పిందన్నారు. పోలీసులు స్టేషన్‌ రాకుండా పిర్యాదు చేయొచ్చని అంటున్నారు. మరి నా కేసు ఎందుకు నమోదు చేయలేదని వీహెచ్‌ ప్రశ్నించారు.

ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌ భగవత్‌ హిందూ అనేది ఓ మతం లేదా భాష కాదని, ఓ దేశం పేరూ కాదని చెప్పుకొచ్చారు. భారత్‌లో నివసించే వారందరి సంస్కృతి హిందూ అని వ్యాఖ్యానించారు. భిన్న సంస్కృతులను హిందూ విధానం ఆమోదించి గౌరవిస్తుందని చెప్పారు

Next Story