హైద్రాబాద్ : విజయవాడ జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఓ కారు రెండు బైకులు, రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన హోం గార్డ్ యాదిగిరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 సిబ్బంది హాస్పిటల్ కు తరలించింది.