మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నర్సింగ్‌పూర్‌ జిల్లా పఠా రోడ్‌ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి ఆగ్రాకు మామిడిపళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు పఠా రోడ్‌ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ట్రక్కులో మొత్తం 16 మంది కూలీలున్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. వాహనాలు తిరగకపోవడంతో క్రైమ్‌ రేటు కూడా పూర్తిగా తగ్గిపోయింది. రెండు రోజుల కిందట ఔరంగాబాద్‌లో పట్టాలపై పడుకున్న వలస కూలీలపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లడంతో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే లాక్‌ డౌన్‌లో కొన్ని మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. అందులో కొన్ని అత్యవసరమైన వాహనాలు తిరిగేందుకు అనుమతి ఇవ్వడంతో మళ్లీ రోడ్డు ప్రమాదాలు మొదలయ్యాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *