మున‌గాల‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 May 2020 9:45 AM IST
మున‌గాల‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుంద పురం స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. వివ‌రాళ్లోకెళితే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న AP28 CD 6851 నెంబ‌రు గ‌ల ఇండికా కారు మునగాల మండలం ముకుంద పురం వద్ద ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతుల్లో ఒక మహిళ‌ కొల్లపూడి ధనలక్షిగా గుర్తించారు. కారు గుంటూరు జిల్లా కేంద్రంలో రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్‌దిగా గుర్తించారు. హైద్రాబాద్ నుండి చంద్ర‌శేఖ‌ర్ బంధువుల‌ను తీసుకొస్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ వ్య‌క్తి పెండ్యాల సాయి సందీప్. సాయి సందీప్‌ది గుంటూరు జిల్లా బాపట్ల.

Next Story