ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Oct 2020 4:40 AM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం వెళ్తున్న కార్మికులను గ్యాస్‌ ట్యాంకర్ మృత్యువు రూపంలో వచ్చి వారిని కబళించింది. వివరాల్లోకి వెళ్తే.. ధార్ జిల్లాలోని ఇండోర్ - అహ్మదాబాద్ రహదారిపై తిర్లా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చిఖాలియా ఫటా వద్ద సోయాబీన్ పంట సేకరించే 20 మందికిపైగా కార్మికులతో నిండిన వ్యాన్‌ పంక్ఛర్‌ కావడంతో రోడ్డు పక్కన డ్రైవర్‌ నిలిపివేశారు.

వెనుక నుంచి వచ్చిన గ్యాస్ ట్యాంకర్ వ్యాన్ ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో కూర్చున్న ఆరుగురు కార్మికులు అట్టడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో 14 మంది గాయపడ్డారు. గాయప‌డ్డ వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఇండోర్ ఆసుప‌త్రికి తరలించారు.

సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.‌ క్షతగాత్రులను చికిత్స కోసం దవాఖానకు తరలించారు. మృతుల కుటుంబాలకు కలెక్టర్‌ సింగ్‌ అలోక్‌సింగ్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. మృతిచెందిన వారిలో బాల కార్మికులు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Next Story
Share it