అరెస్ట్ అయిన తర్వాత రియా చక్రవర్తి చర్య ఊహించలేదు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Sep 2020 2:20 PM GMT
అరెస్ట్ అయిన తర్వాత రియా చక్రవర్తి చర్య ఊహించలేదు..!

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ కేసులో ఆమెను అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌సీబీ తెలిపింది. రియాను అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించడానికి వెళ్లిన సమయంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె మీడియా వైపు చేతులు ఊపిన తర్వాత పోలీసు వాహనంలోకి ఎక్కింది. ఆమె ఎందుకు అలా చేసిందో ఎవరికీ అర్థం అవ్వలేదు.

సుశాంత్ సింగ్ మరణం తర్వాత రియా చుట్టూ నేషనల్ మీడియా తిరిగిన సంగతి తెలిసిందే..! ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని పలువురు తీవ్రంగా ఆరోపించారు. ఆమె అరెస్ట్ తప్పదని ఇంతకు ముందే అందరూ ఊహించారు. ఊహించినట్లుగానే ఆమెను ఈరోజు అరెస్ట్ చేశారు.

S

రియాను ఎన్‌సీబీ నాలుగు రోజుల పాటు రియాను విచారించింది. విచారణలో ఆమె 25 మంది బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్‌‌ అయిన విషయం తెలిసిందే. రియా సూచనల మేరకు సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడని రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి‌ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే ఎన్‌సీబీ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే రియాకు చెందిన మొబైల్‌, ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటినుంచి కీలక ఆధారాలను సేకరించారు.

రియా చక్రవర్తి అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన బీహార్ డీజీపీ:

ఎన్సీబీ అధికారులు రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడంపై బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రియాకు వ్యతిరేకంగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బలమైన ఆధారాలే సంపాదించినట్టుందని అన్నారు. ఆమెకు డ్రగ్స్ విక్రేతలతో సంబంధాలు కూడా ఖచ్చితంగా ఉండడంతోనే ఆమెను అరెస్టు చేసి ఉంటారని ఆయన అన్నారు.

Next Story
Share it