సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి రేప్, మర్డర్ బెదిరింపులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 July 2020 1:51 PM IST
సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి రేప్, మర్డర్ బెదిరింపులు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్, రియా చక్రవర్తి మంచి స్నేహితులు అనే సంగతి బాలీవుడ్ మొత్తానికి తెలుసు. సుశాంత్ మరణించిన తర్వాత రియా చక్రవర్తి గురించే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సుశాంత్ మరణం ఆమెను కబళించి వేసింది. ఇటీవలే సుశాంత్ ను తాను ఎంత మిస్ అవుతున్నానో పోస్టు పెట్టింది.

తాజాగా ఆమె తనకు సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు ఎదురయ్యాయంటూ పోస్టు పెట్టింది. జులై 16న రేప్ చేయడం, చంపేయడం వంటి బెదిరింపులు వచ్చిన స్క్రీన్ షాట్ ను పోస్టు చేసింది.

తన మీద ఎంతో మంది, ఎన్నో రకాలుగా తిట్టారని.. కానీ వాటన్నిటినీ సహిస్తూ వచ్చానని.. కానీ నిన్ను రేప్ చేస్తాము.. చంపేస్తాము అంటే మౌనంగా ఉండలేనని తెలిపింది. ఇలా మాట్లాడడం ఎంతో తప్పని.. అలా బెదిరించే ఎవరికీ లేదని తెలిపింది.

"I was called a gold digger ..I kept quiet. I was called a murderer ....I kept quiet. I was slut shamed ....I kept quiet. But how does my silence give you the right to tell me that you will get me RAPED and MURDERED if I don’t commit suicide @mannu_raaut?" అంటూ స్క్రీన్ షాట్ ను పెట్టింది.

@cyber_crime_helpline @cybercrimeindia లు ఈ అకౌంట్ పై యాక్షన్ తీసుకోవాలని కోరింది.

సుశాంత్ చనిపోయిన నెల రోజుల తర్వాత రియా చక్రవర్తి ఇటీవలే సామాజిక మాధ్యమాల్లోకి వచ్చింది. సుశాంత్ గురించి భావోద్వేగ పూరిత పోస్ట్ పెట్టింది. ‘నువ్వు ప్రశాంతంగా ఉండాలి సుశి.. నిన్ను కోల్పోయి 30 రోజులు అయ్యింది.. కానీ జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను.. నీతో ఎప్పటికీ నా అనుబంధం అలాగే ఉంటుంది’ అని రాసుకుని వచ్చింది రియా. నా భావోద్వేగాలను ఎదుర్కోడానికి ఇంకా కష్టపడుతున్నాను. నా మనసులో ఏదో అలజడి. నాకు ప్రేమ మీద నమ్మకాన్ని కలిగించావు. ప్రేమకున్న శక్తిని తెలిసేలా చేశావని తన పోస్టులో చెప్పుకొచ్చింది రియా. జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించావు.. దాన్నినేను ప్రతి రోజు నేర్చుకుంటానని నీకు మాట ఇస్తున్నాను.. నువ్వు శాశ్వతంగా వెళ్లిపోయావనే విషయాన్ని నేనింకా నమ్మలేకపోతున్నానని ఆమె తన మనసులోని బాధను వ్యక్త పరిచింది. ప్రశాంతమైన ప్రదేశంలో నువ్వు ఉన్నావని నాకు తెలుసు.. నీలాంటి గొప్ప శాస్త్రవేత్తకు చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీలు స్వాగతం పలికాయని నమ్ముతున్నాను.. నీ మంచితనం, ఆనందంతో ప్రతి దాన్ని అద్భుతంగా మార్చగలవు. నీకోసం ఎంతో ఎదురు చూస్తుంటాను. నిన్ను మళ్లీ తిరిగి నా దగ్గరకు తీసుకు రావాలని కోరుకుంటున్నాను.. అని ఆమె సుశాంత్ తో ఉన్న ఫోటోలను పోస్టు చేసింది.

రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డేటింగ్ లో ఉన్న సమయంలో చాలా సార్లు వాళ్ళు కలిసి కనిపించారు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత అతడి పార్థివ దేహాన్ని చూడడానికి రియా కూపర్ ఆసుపత్రికి వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ముంబై పోలీసులు 30 మందిని పైగా విచారించారు. రియా చక్రవర్తిని కూడా కొన్ని గంటల పాటూ విచారించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తనను యశ్ రాజ్ ఫిలిమ్స్ తో ఉన్న కాంట్రాక్టును రద్దు చేసుకోమని కోరాడని విచారణలో రియా చక్రవర్తి తెలిపింది.

Next Story