రియా బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. వారివి కూడా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Sep 2020 11:53 AM GMT
రియా బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. వారివి కూడా..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ డెత్ మిస్ట‌రీ‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ.. డ్ర‌గ్స్ కేసులో అరెస్టైన‌ నటి రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి‌, సుశాంత్ మేనేజనర్ శామ్యూల్ మిరాండా, పని మనిషి దీపేశ్ సావంత్, డ్రగ్స్ డీలర్లు అబ్దుల్ బాసిత్, జైద్ విలాత్రా బెయిల్ పిటిషన్లను ముంబై ప్రత్యేక కోర్టు శుక్రవారం తిరస్కరించింది. దీంతో ఈ నెల 22 వరకు రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీపై బైకుల్లా జైలులో ఉండనున్నారు.

సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్.సి.బి. రియాను ఈ నెల 9న అరెస్ట్ చేసింది. అంత‌కుముందే ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి‌, సుశాంత్ మేనేజనర్ శామ్యూల్ మిరాండా, పని మనిఫి దీపేశ్ సావంత్, డ్రగ్స్ డీలర్లు అబ్దుల్ బాసిత్, జైద్ విలాత్రాను ఎన్సీబీ ప్రశ్నించి అరెస్ట్ చేసింది. సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న సంగతిని గురించి దర్యాప్తులో వీరంతా అంగీకరించినట్లు సమాచారం. అయితే ఎన్.సి.బి. బలవంతంగా తమ నుంచి తప్పుడు స్టేట్‌మెంట్లను రికార్డు చేసిందని వారు ఆరోపించారు.

మరోవైపు వీరి బెయిల్ పిటిషన్ల‌ను స్థానిక కోర్టు తిరస్కరించడంతో ఈ నెల 9న ముంబై ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. గురువారం నిందితులు, ఎన్.సి.బి. తరుఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయితే నిందితులకు బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను నాశనం చేస్తారని కోర్టుకు ఎన్.సి.బి. తెలిపింది. ఇరువైపు వాదనలు విన్న ముంబై ప్రత్యేక కోర్టు వారి బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.

Next Story