అనుకున్నదే చేశాడు.. మారుతి రావుగా ఎవరంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Jun 2020 3:03 PM GMT
అనుకున్నదే చేశాడు.. మారుతి రావుగా ఎవరంటే..?

రామ్ గోపాల్ వర్మ.. ఏ వివాదాన్నైనా సినిమాగా తీయగల సమర్థుడు. ప్రస్తుతం ప్రణయ్-అమృత-మారుతిరావు క్యారెక్టర్స్ మీద పడ్డాడు. 'మర్డర్' అంటూ సినిమాను ప్రజల మీదకు వదలబోతున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫాదర్స్ డే రోజున విడుదల చేసి మరో సంచలనానికి నాంది పలికాడు రామ్ గోపాల్ వర్మ. అమృత, ఆమెను ఎంతో ప్రేమించిన మారుతీ రావుల విషాద కథను ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఫాదర్స్ డే సందర్భంగా నేటి సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తున్నానని తెలిపి అందరికీ షాక్ ఇచ్చిన వర్మ.. 5 గంటలకు ఆ పోస్టర్ ను విడుదల చేశాడు.



ఓ కూతురిని అమితంగా ప్రేమించిన డేంజర్ ఫాదర్ అమృత-మారుతీ రావు కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'మర్డర్' కుటుంబ కథా చిత్రం అన్న ట్యాగ్ లైన్ ను కూడా తగిలించాడు వర్మ. ఇది మీ గుండెను తడి చేస్తుంది.. హ్యాపీ ఫాదర్స్ డే సందర్భంగా చెడ్డ ఫాదర్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్' అంటూ మరో ట్వీట్ చేశాడు వర్మ. ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. కుమార్తెను హత్తుకుని ఉన్న పోస్టర్ ను ప్రజల మీదకు వదిలాడు. మారుతీరావు క్యారెక్టర్ ను డాక్టర్ కృష్ణస్వామి శ్రీకాంత్ పోషిస్తున్నాడు.

Next Story