ఆర్జీవీ మిస్సింగ్.. మరో పోస్టర్‌ను విడుదల చేసిన వర్మ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 5:10 PM IST
ఆర్జీవీ మిస్సింగ్.. మరో పోస్టర్‌ను విడుదల చేసిన వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ టైంలో అందరూ సినిమాలకి దూరంగా ఉంటే తాను మాత్రం వరుసపెట్టి సినిమాలను తీశాడు. ఈ క్రమంలో "ఆర్జీవీ మిస్సింగ్" అనే పేరుతో ఓ సినిమాని అనౌన్స్ చేశాడు. సినీ రాజకీయ నాయకులపై సెటైరికల్ గా మూవీస్ తీస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే వర్మ.. 'ఆర్జీవీ మిస్సింగ్' సినిమా తనపైనే తీసుకున్నాడు. రాంగోపాల్ వర్మ కిడ్నాప్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రోజుకొక పోస్టర్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు.



తాజాగా ఈ సినిమాలోంచి ఆయన మరో పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో తాను కనపడకుండా పోవడంతో దీనిపై విచారణ జరుగుతుందని, అనుమానితులుగా పీకే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఉంటారని చెప్పారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో పలువురు ప్రముఖులను పోలిన పాత్రలను చూపించారు. ‘ఆర్జీవీ మిస్సింగ్ త్వరలో రానుంది. ఇందులో పీకే, ఎమ్మెస్, బీ, మాజీ సీఎం, పప్పు, కేపీ, ఆర్కే ఉన్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు.



Next Story