ముంబైకి పొంచివున్న ప్రమాదం.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

By సుభాష్  Published on  15 Oct 2020 3:30 AM GMT
ముంబైకి పొంచివున్న ప్రమాదం.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్థంభించిపోతోంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనాలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. అటు అధికారులు మాత్రం మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గురువారం ముంబైతో పాటు మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మహారాష్ట్రలోని ముంబై, థానే, షోలాపూర్‌ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంబై నగరానికి వరదల ముప్పు పొంచివుందని హెచ్చరించారు.

వర్షాల ధాటికి ఆరుగురు మృతి

షోలాపూర్‌ జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఆరుగురు మృతి చెందారు. అలాగే పూణే జిల్లా నింగాన్‌ కేట్కీ గ్రామంలో వరదల్లో చిక్కుకున్ 40 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ముంబైలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని బీఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Next Story