కేటీఆర్‌కు 'అంబ‌టి రాయుడు' రిక్వెస్ట్.. ఏమిటంటే..?

By Medi Samrat  Published on  23 Nov 2019 2:46 PM GMT
కేటీఆర్‌కు అంబ‌టి రాయుడు రిక్వెస్ట్.. ఏమిటంటే..?

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో అవినీతి పెరిగిపోయిందంటూ టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతిని కట్టడి చేయాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ వేధిక‌గా కోరారు.

ఈ మేరకు అంబటి రాయుడు తన ట్విట్టర్‌లో "కేటీఆర్‌ సర్‌... హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతి వైపు దృష్టిసారించండి. హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి అవినీతే కారణం. హెచ్‌సీఏను డబ్బుతో ప్రభావితం చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. హెచ్‌సీఏను ఎవరైతే ప్రభావితం చేస్తున్నారో వారిపై చాలా ఏసీబీ కేసులు ఉన్నాయి. వారికే రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారు" అని ట్వీట్ చేశాడు.

ఇదిలావుంటే.. ఇటీవల జరిగిన విజయ్‌ హజారే, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీల్లో హైదరాబాద్‌ జట్టుకు అంబటి రాయుడు కెప్టెన్‌గా వ్యవహరించారు. బోర్డు రాజ‌కీయాల‌తో విసుగెత్తిన అంబ‌టి రాయుడు వచ్చే రంజీ సీజన్‌లో హైదరాబాద్‌ జట్టుకు దూరంగా ఉంటానంటూ ప్ర‌క‌టించాడు.

కాగా, టీమిండియా మాజీ కెప్టెన్, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లో కెరీర్ ఆర్థంత‌రంగా కెరీర్ ముగించిన మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజహరుద్దీన్ ఇటీవలే జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ నేఫ‌థ్యంలో రాయుడు కామెంట్స్ ఎంత దుమారం రేప‌నున్నాయో వేచిచూడాల్సిందే..!



Next Story