ఆ పోస్టు నేను రాయలేదు.. చేయలేదు.!
By న్యూస్‌మీటర్ తెలుగు
రతన్ టాటా.. టాటా గ్రూప్స్ ఛైర్మన్. దేశంలో దిగ్గజ వ్యాపారవేత్త. అంతేకాదు ఎంతో ఉదార స్వభావం ఉన్న మహనీయుడు. ఇలా టాటా గురించి చెప్పాలంటే చాలావున్నాయి. అయితే ఎప్పుడు ఏదో మంచి విషయమై వార్తల్లో ఉండే రతన్ టాటా మీద మోటివేషన్ పోస్టు పేరుతో ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ పతనంపై రతన్ టాటా ఆ మోటివేషనల్ పోస్టు చేసినట్లుగా.. ఆ పోస్టుకు టాటా పోటోను జతచేసారు. నిపుణులు అంటూ ఊహాగానాలు వ్యక్తం చేసిన వారిని టాటా ఖండిస్తూ.. ఓ సందేశం ఇస్తున్నారనేది ఈ పోస్టు సారాంశం.
పోస్టు విషయానికొస్తే.. భారత ఆర్థిక రంగం పతనమవుతుంది అంటూ నిపుణులు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. వారెవరో నాకు తెలియదు కానీ.. మానవ స్ఫూర్తి, దృఢ సంకల్పం గురించి నిపుణులకు మాత్రం ఏం తెలియదని చెప్పగలను. వారు చెప్పేవే నిజాలైతే... రెండో ప్రపంచ యుద్దం తర్వాత ఇక జపాన్‌కు భవిష్యత్తు ఉండిఉండకూడదు. అరబ్బుల కారణంగా ఇజ్రాయెల్ ప్రపంచం పటం నుంచి కనిపించకుండా పోవాలి. 1983లో భారత్‌కు క్రికెట్ వరల్డ్ కప్ వచ్చేది కాదు. వీటన్నింటికి వాస్తవాలు మరోలా ఉన్నాయి, అలాగే.. ఇప్పుడొచ్చిన కరోనా గండం కూడా దీనికి భిన్నమేమి కాదు. త్వరలోనే దీన్ని జయిస్తామనేది ఈ పోస్టు సారాంశం.
అయితే.. రతన్ టాటా ఈ వార్తను ఖండించారు. ఆ పోస్టు నేను చేయలేదు... రాయలేదు అని తెలిపారు. అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవార్తల పట్ల నిజానిజాలు తెలుసుకోవాలని హితువు పలికారు. నేనేదైనా చెప్పదల్చుకుంటే అధికారికంగానే చెబుతానని తెలిపారు.
ఇక.. ఈ పోస్టు రతన్ టాటా చేశారు. స్పూర్తి పొందే విషయం కదా అని ఈ సోస్టును బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి షేర్ చేశారు. అంతేకాదు. రతన్ టాటా మీద నాకు చెప్పలేనంత గౌరవముందంటూ ట్యాగ్‌ను కడా జతచేశాడు. ఏదేమైనా జరగాల్సింది జరిగిపోయింది. ఈ వార్త అన్ని సోషల్ మీడియా వేదికల్లో ఇప్పుడు హల్‌చల్ చేస్తుంది.