క‌రోనా సోకి కాదు ఈ చిన్నారి మ‌ర‌ణం.. వైద్యుల‌ నిర్ల‌క్ష్యంతో..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 April 2020 4:31 PM GMT
క‌రోనా సోకి కాదు ఈ చిన్నారి మ‌ర‌ణం.. వైద్యుల‌ నిర్ల‌క్ష్యంతో..

బుడిబుడి అడుగుల‌తో త‌ల్లిదండ్రుల క‌ళ్ల‌ముందు ఆడుకోవాల్సిన ప‌సిత‌నం ఈ చిన్నారి బాలుడిది. కానీ కాలం చేసిన గాయానికి బ‌లైపోయాడు పాపం. స‌మ‌యానికి అంబులెన్స్ సౌకర్యం అంద‌క‌పోవ‌డంతో త‌మ కొడుకు ప్రాణాలు విడిచాడంటూ రోదిస్తున్న త‌ల్లిదండ్రుల దీన‌గాథ ఇది. ప్ర‌తి ఒక్క‌రిని కంట‌త‌డి పెట్టిస్తున్న ఈ ఘ‌ట‌న బీహార్ రాష్ట్రంలో జ‌రిగింది.

వివ‌రాళ్లోకెళితే.. గిరేజ్ కుమార్‌కు మూడేళ్ల కుమారుడు. రెండు రోజుల క్రితం ఆ బాబు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. జ్వరం, జలుబు, దగ్గుతో తీవ్ర‌ ఇబ్బంది పడ్డాడు. దీంతో గిరేజ్ కుమార్ దంప‌తులు తమ స్వగ్రామమైన షాహోపార్‌లోని వైద్యులను సంప్రదించారు.

అయితే.. అప్పటికే బాబు ఆరోగ్య‌ పరిస్థితి సీరియ‌స్ అయ్యింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా లాక్‌డౌన్ ఉండ‌టంతో.. అంబులెన్స్ దొర‌క‌క ద‌గ్గ‌ర్లోని జెహానాబాద్‌కు తీసుకెళ్లేందుకు ఓ టెంపోను సిద్దం చేసుకుని.. సర్దార్ ఆసుపత్రికి వెళ్లారు. అక్క‌డి వైద్యులు పాట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రికు రెఫర్ చేశారు. కానీ వైద్యులు.. అంబులెన్స్ మాత్రం సమకూర్చలేదు. ఫ‌లితం.. జహానాబాద్ ఆసుపత్రిలో శుక్రవారం వారి మూడేళ్ల కుమారుడు మృతి చెందాడు.

అయినా చిన్నారిని బ‌తికించుకోవాల‌నే తాప‌త్ర‌యంతో తల్లిదండ్రులు బాలుడి మృత‌దేహాన్ని ప‌ట్టుకుని జహానాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని పాట్నాకు కాలినడక బయలుదేరారు. కానీ ఫ‌లితం శూన్యం.. బాలుడు అప్ప‌టికే మృతిచెందాడు. స‌మ‌యానికి అంబులెన్స్ అందివ్వ‌లేక‌పోయిన అధికారుల‌ నిర్లక్ష్యం కారణంగా తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని గిరేజ్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యాడు.

కాగా.. బాలుడి మృతి తర్వాత స్థానికుల సాయంతో తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్నారు. బిడ్డ మృతదేహాన్ని చేతిలో పట్టుకుని నడుస్తున్న మహిళ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాతో ప్ర‌తిఒక్క‌రి చేత‌ కన్నీరు పెట్టిస్తుంది. ఈ విష‌య‌మై వైద్యులు, అధికారుల తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. వీడియో వైరల్ కావడం, వైద్యుల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఫైఅధికారులు కూడా స్పందించారు. సర్దార్ ఆసుపత్రి మేనేజర్, వైద్యులను.. జిల్లా మేజిస్ట్రేట్ నవీన్ కుమార్ సస్పెండ్ చేసి షోకాజ్ నోటీస్ ఇచ్చారు.



Next Story