యాంక‌ర్‌ ర‌ష్మీగౌత‌మ్‌కు క‌రోనా పాజిటివ్‌.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2020 11:11 AM GMT
యాంక‌ర్‌ ర‌ష్మీగౌత‌మ్‌కు క‌రోనా పాజిటివ్‌.!

తెలుగు బుల్లితెర‌, సినీ ప్రేక్షకులకు రష్మి గౌతమ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. అవకాశం ఉన్నప్పుడు సినిమాల్లో న‌టిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. ర‌ష్మీకి క‌రోనా పాజిటివ్ అనే వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ర‌ష్మీగౌత‌మ్ ఇటీవ‌ల స్వ‌ల్ప అస్వ‌స్థ‌తకు గురి కావ‌డంతో క‌రోనా టెస్టులు చేయించుకొన్నార‌ని, ఆరోగ నిర్థార‌ణ ప‌రీక్ష‌ల్లో ఆమెకు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింద‌ని అనే విష‌యాన్ని స‌న్నిహితులు ధృవీక‌రిస్తున్నారు. అయితే ర‌ష్మీ గౌత‌మ్ అధికారికంగా ధృవీక‌రించ‌లేదు. దీంతో అనేక సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె షూటింగ్స్‌ అన్నింటికీ దూరంగా ఉంటోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు సంబంధించి అక్టోబర్ 23వ తేదీన అలాగే అక్టోబర్ 28 తేదీన జరిగే షూటింగ్స్‌ను క్యాన్సిల్ చేసినట్టు యూనిట్ వర్గాలు పేర్కొనడంతో జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. అయితే తనకు కరోనా సోకినట్లు రష్మీ గౌతమ్ అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది.

ఇక సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడ్డారని గత వారం రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మీ గౌతమ్ నటించిన బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో నందుతో కలిసి నటించారు. ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొంటున్న సమయంలోనే రష్మీకి కరోనా సోకడంతో ఆ కార్యక్రమాలను కూడా కొద్ది రోజులు నిలిపివేసినట్టు తెలుస్తున్నది.

Next Story