కోవిడ్‌తో నాన్న(రాజ‌శేఖ‌ర్‌) పోరాటం కాస్త కష్టంగా మారిందని, ఆయన త్వరగా కోలుకోవాలని.. దయచేసి ప్రార్థనలు చేయండని కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసిన శివాత్మిక తాజాగా మరో ట్వీట్ చేసింది. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, భయం వద్దని సూచించింది.మీ ప్రేమకు, అభిమానానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉంది. క్రమంగా మెరుగవుతోంది. మాకు కావాల్సింది మీ ప్రార్థనలు మాత్రమే. ఆయన ఆరోగ్యం విషయంలో భయం వద్దు. తప్పుడు వార్తలను ప్రచారం చెయ్యవద్దని శివాత్మిక కోరింది.అంత‌కుముందు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన కూతురు శివాత్మిక ట్విటర్ ద్వారా తెలియజేసింది. కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారింది. అయినా ఆయన ధైర్యంగానే పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని శివాత్మిక పేర్కొంది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story