వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్.. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ నుంచి తారక్‌ టీజర్‌

By సుభాష్  Published on  22 Oct 2020 7:28 AM GMT
వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్.. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ నుంచి తారక్‌ టీజర్‌

అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ గురించి సరికొత్త అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ మూవీ నుంచి తారక్‌ టీజర్‌ విడుదలైంది. అభిమానుల అంచనాలు మించిపోయేలా రాజమౌళి ఈ టీజర్‌ను రూపొందించారు. కొమురంభీమ్‌ పాత్రలో తారక్‌ ఒదిగిపోయారు. టీజర్‌లో రగిలే నిప్పులా కనిపించారు. బ్యాక్‌రౌండ్‌లో చరణ్‌ వాయిస్‌ మరింతగా అదరిపోయింది. 'వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్‌.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయ్‌.. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ.. నా తమ్ముడు గోండు బెబ్బులి.. కొమురంభీం పాత్ర పోషిస్తోన్న తారక్‌ పాత్ర పరిచయం చేశాడు.

రౌద్రం రణం రుథిరం పేరుతో ఎన్టీఆర్‌, చరణ్‌లు హీరోలుగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా మూవీగా ఈ పిరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కొమురంభీమ్‌ పాత్రలో నటిస్తుండగా, చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌ కనిపించనున్నాడు. రాజమౌళి బాహుబలి సిరీస్‌ తర్వాత తెరకెక్కిస్తోన్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌ నిలిచిపోగా, మళ్లీ ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. షూటింగ్‌ ప్రారంభమైన వెంటనే ఎన్టీఆర్‌కు సబంధించిన సన్నివేశాలను చిత్రీకరించి, ప్రత్యేక వీడియోను విడుదల చేస్తామని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు.

Next Story