అరుదైన రికార్డ్ కొట్టేసిన హిట్ మ్యాన్..!
By న్యూస్‌మీటర్ తెలుగు
బ్యాట్ పట్టాడంటే రికార్డులు బద్దలు అవ్వాల్సిందే. యాభై, వంద పరుగులు ఆయనకు సరిపోవు. రెండొందలు కొడితే కాని..ఆ బ్యాట్ హ్యాపీ ఫీలవుతుంది.టెస్ట్ మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన మొదటి సిరీస్‌లోనే మనోడు అదరహో అనిపించాడు. మొత్తం మూడు సెంచరీలు బాదాడు. దానిలో రాంచీలో చేసిన డబుల్ సెంచరీ కూడా ఉంది. బ్యాట్ పట్టాడంటే పరుగుల వరద పారాల్సిందే అన్నట్లు రోహిత్ తన సహజ ధోరణిలో చెలరేగిపోతున్నాడు.
ఇక..రాంచీలో రోహిత్ కొట్టిన డబుల్ సెంచరీ (212) అరుదైన రికార్డ్ ను హిట్ మేన్ సొంతం చేసింది. ప్రత్యర్ధి జట్టు వేర్వేరు ఇన్నింగ్స్‌లో సాధించిన స్కోర్ కంటే మనోడు ఎక్కువ కొట్టాడు. మూడో టెస్ట్‌లో సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 162 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికన్లు రోహిత్ చేసిన పరుగులు కూడా సాధించలేకపోయారు.
అంతకు ముందు నలుగురు భారత బ్యాట్స్‌మెన్లు ఈఘనత సాధించారు. అందులో విజయ్ మన్కడ్ (231- న్యూజిలాండ్ పై రికార్డ్). వాల్ రాహుల్ ద్రావిడ్ (270పాకిస్తాన్‌పై రికార్డ్), సచిన్ (248- బంగ్లాదేశ్ పై రికార్డ్), కోహ్లీ - (243 శ్రీలంకపై రికార్డ్) .తాజాగా ఈ క్లబ్ లోకి రోహిత్ చేరాడు.