రామ్‌గోపాల్‌ వర్మకు సైబర్‌క్రైమ్‌ పోలీసుల నోటీసులు..!

By అంజి  Published on  16 Dec 2019 5:28 AM GMT
రామ్‌గోపాల్‌ వర్మకు సైబర్‌క్రైమ్‌ పోలీసుల నోటీసులు..!

హైదరాబాద్‌: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఎదుట హాజరు కావాలని తెలిపారు. కాగా రేపు ఉదయం రామ్‌గోపాల్‌ వర్మ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ పాల్ కోడలు పిర్యాదు చేశారు. తన ఫోటోలు, వీడియోలు మార్పింగ్ చేసి వాడారని పిర్యాదు కే.ఏ పాల్‌ కోడలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గ‌తంలో మాజి రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీతో తాము దిగిన ఫొటోల‌ను మార్పింగ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశార‌ని బెగాల్ జ్యోతి ఆరోపించారు. రాంగోపాల్ వ‌ర్మ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బెగాల్ జ్యోతి పోలీసుల‌ను కోరింది. కాగా రాంగోపాల్ వ‌ర్మ‌పై ఐపీసీ 469 సెక్ష‌న్ కింద సైబ‌ర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు.

రాంగోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు సినిమాకు సెన్సార్ బోర్డు రివైజింగ్ క‌మిటీ లైన్ క్లియ‌ర్ చేయడంతో ఈ సినిమా విడుదలైంది. మొద‌ట‌ క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు టైటిల్ వివాదం చెలరేగింది. హైకోర్టు ఆదేశాల మేర‌కు రాంగోపాల్ వ‌ర్మ సినిమా టైటిల్ ను అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లుగా మార్చారు. అయితే ఈ నెల 12న విడదలైన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేపోయిందని సమాచారం.

Next Story