ఎన్డీయేకే మా మ‌ద్ద‌తు : వైసీపీ ఎంపీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Sept 2020 4:42 PM IST
ఎన్డీయేకే మా మ‌ద్ద‌తు : వైసీపీ ఎంపీ

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైసీపీ ఎన్డీయేకు మద్దతు తెలిపింది. ఈ విష‌య‌మై వైసీపీ రాజ్యసభ ఎంపీ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌కే మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. అయితే.. ఈ ఎన్నిక‌ల్లో ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ పోటీ చేస్తుండగా.. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా ఆర్‌జేడీ ఎంపీ మనోజ్‌ ఝా బరిలోకి దిగుతున్నారు.

ఇదిలావుంటే.. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులకు గాను 244 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 123 మంది మద్దతు పొందినవారికి డిప్యూటీ చైర్మన్‌ పదవి దక్కుతుంది. ఈ ఎన్నికల్లో బీజేడీ, వైసీపీ, టీఆర్ఎస్ పార్టీల మద్దతు కీలకంగా మారిన‌ నేఫ‌థ్యంలో.. ఎన్నికల్లో ఓటింగ్‌కు టీఆర్ఎస్ దూరంగా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.



Next Story