క్రికెట్‌కు ఆ స్టార్ ఆల్‌రౌండర్ గుడ్‌బై
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 July 2020 9:58 AM GMTదేశవాళీ క్రికెటర్, ఐపీఎల్ ఆటగాడు రజత్ భాటియా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు రజత్ భాటియా బుధవారం రోజున ప్రకటించాడు. ఆల్‌రౌండర్ అయిన రజత్.. తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో.. బౌలర్‌గా 137 వికెట్లు పడగొట్టడమే కాకుండా.. బ్యాట్స్‌మెన్‌గా కూడా 6,482 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇక రజత్ రంజీ క్రికెట్‌లో తమిళనాడు, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2007-08లో రంజీ ట్రోఫీ టైటిల్ విజేతగా నిలిచిన డిల్లీ జట్టులో రజత్ సభ్యుడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో 139 పరుగులతో అజేయంగా నిలిచాడు. తమిళనాడు తరఫున 1999-2000 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.
తొలి ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్‌కు రజత్ భాటియా ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ జట్లకు ఆడాడు. 2017 ఐపీఎల్‌లో రజత్ తన చివరి మ్యాచ్ ఆడాడు. తన కెరీర్ 95 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన రజత్.. 2012లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన కేకేఆర్ టీమ్(కోల్‌కత్తా నైట్రైడర్స్) టీమ్‌లో సభ్యుడు.