రాజశేఖర్ హెల్త్ బులిటెన్ విడుదల.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 27 Oct 2020 7:17 PM IST

టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్ కొద్ది రోజుల క్రితం కరోనాతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా వైద్యులు రాజశేఖర్‌కు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు.
Also Read
సినిమాల్లోకి రానున్న వంటలక్క ..!ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఐసీయూలో ఉన్నారని.. చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ప్లాస్మా థెరపీ చేశామని.. ప్రత్యేక వైద్య బృందం అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు అని వైద్యులు పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. రాజశేఖర్ ఫ్యామిలీ అంతా కరోనా బారిన పడగా, ఆయన ఇద్దరు కూతుళ్లు శివానీ, శివాత్మిక కోలుకున్నారు. ఇక ఆయన సతీమణి జీవితకు కూడా నెగెటివ్ రావడంతో ఆమెనూ డిశ్చార్జ్ చేశారు.
Next Story