సినిమాల్లోకి రానున్న వంటలక్క ..!

By సుభాష్  Published on  27 Oct 2020 9:16 AM GMT
సినిమాల్లోకి రానున్న వంటలక్క ..!

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తున్న సిరీయ‌ల్ కార్తీక‌దీపం. ఈ సీరియ‌ల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. టాప్ సీరియ‌ల్‌గా బుల్లితెర‌పై త‌న హ‌వా చాటుతోంది. అందులో వంటలక్క క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ పేరు చెబితే చాలు తెలుగు రాష్ట్ర ప్రజలు అభిమానంతో తడిసి ముద్దవ్వడానికి.

ఇక పోతే ఈ సీరియల్ లో వంటలక్కగా నటిస్తూ ఆకట్టుకుంటున్న మలయాళీ నటి ప్రేమి విశ్వనాథ్. ఈమె పేరు అంద‌రికీ తెలియ‌న‌ప్ప‌టికి వంట‌ల‌క్క అంటే మాత్రం ఇట్టే గుర్తుప‌ట్టేస్తారూ. బుల్లి తెర పై క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ప్రేమ్ విశ్వనాథం త్వరలో వెండితెర పై అరంగ్రేటం చేయబోతోంది. ఈమె క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని కొందరు దర్శక నిర్మాతలు ఏరికోరి వారి సినిమాల్లో ఆమెకు ఛాన్స్ లు ఇస్తున్నారట‌.

ఇక ఈ విషయాన్ని ప్రేమి విశ్వనాథ్ స్వయంగా కన్ఫామ్ చేసింది. తెలుగులో తెరకెక్కుతున్న ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతుందట. నిజానికి కరోనా రాకపోయి ఉంటే ఈ పాటికి ఆమె నటించిన ఓ సినిమా కూడా రిలీజ్ అయ్యి ఉండేది అట. కరోనా రావడం వలన ఆ సినిమా షూటింగ్ వాయిదా పడిందని ఇటీవల చెప్పుకొచ్చింది ప్రేమీ విశ్వనాధ్. కాగా వంటలక్క సినిమా కోసం ఆమె ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని చాలా ఆశగా ఎదురుచూస్తూ వున్నారు.

Next Story