బిగ్ బాస్-4 లోకి మరో వైల్డ్ కార్డు ఎంట్రీ..?

By సుభాష్  Published on  27 Oct 2020 8:23 AM GMT
బిగ్ బాస్-4 లోకి మరో వైల్డ్ కార్డు ఎంట్రీ..?

తెలుగులో బిగ్‌బాస్‌ సీజన్ 4 కు నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి రెండు వారాలు రేటింగ్స్‌తో దూసుకుపోయిన ఈ షో.. ఆ త‌రువాత అనుకున్నంత స్థాయిలో రావ‌డం లేద‌ని టాక్ వినిపిస్తోంది. దీంతో మ‌రో వైల్డ్ కార్డు ఎంట్రీ తో షోను మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార్చేందుకు సన్నాహాకాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ షోలో ఇప్పటికే ముగ్గురు సెలెబ్రెటీస్ కుమార్ సాయి, అవినాష్, స్వాతీ దీక్షిత్ లు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ లు ఎలిమినేట్ కూడా అయిపోయారు.

ఇప్ప‌టికే 7 వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్-4 సీజ‌న్ 8వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వారంలో నాలుగ‌వ వైల్డ్‌కార్డు ఎంట్రీగా మంగ్లీని హౌజ్‌లోకి పంపించాల‌ని భావిస్తున్నార‌ట‌. మంగ్లీకి మంచి క్రేజ్ ఉంది. ఆమె ఎంట్రీతో ఖచ్చితంగా షోకు అదనపు ఆకర్షణ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆమెను హౌస్ లోకి పంపించేందుకు నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రచారం. ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేశారని ఆమె ఒప్పుకుందనే వార్తలు కూడా వస్తున్నాయి.

మంగ్లీ తెలంగాణా పాటలతో బాగా ఫేమస్ అయ్యింది. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయిన 'అల వైకుంఠపురంలో' సినిమాలో అనురాగ్ కులకర్ణితో కలిసి ఆమె ఆలపించిన 'రాములో రాముల' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు. గత వారం రోజులుగా మంగ్లీ క్వారెంటైన్ లో ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఎనిమిదవ వారంలో లేదా ఎనిమిది వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక బిగ్ బాస్ ఇంట్లోకి చాలా లేట్ ఎంట్రీ ఇస్తున్న మంగ్లీ తన ఆటతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

Next Story